Leo movie Collections: విజయ్ మూవీకి భారీ ఓపెనింగ్స్... ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
దళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన చిత్రం లియో. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు అంటే అక్టోబర్ 19వ తేదీన థియేటర్లోకి వచ్చింది. ఇక విడుదల అయిన మొదటి రోజు నుంచి ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక విజయ్ ఈ సినిమాలో నెక్ట్ లెవెల్ యాక్టింగ్ చేశారని అంటున్నారు. అంతే కాదు.. సూపర్ ట్విస్టులతో సినిమా సాగిందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్, తొలిరోజు కలెక్షన్లు అంచనా ఎలా ఉందో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్ హీరోగా.. అందాల భామ త్రిష కృష్ణన్ హీరోయిన్ గా నటించిన చిత్రం లియో. ఇక ఈ సినిమాలో అర్జున్ సర్జా కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీ తెలుగు,తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ ఈ సినిమా అక్టోబర్ 19వ తేదీన రిలీజ్ అయింది. ఇక మొదటి షో నుంచే ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది. లోకేష్ కనగరాజ్ తనదైన మార్కుతో ఈ సినిమాకు దర్శకత్వం వహించారని ప్రశంసలు వస్తున్నాయి.

ఇక లియో సినిమాలో అర్జున్ సర్జాతో పాటు... సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ మీనన్, మిస్కిన్ తదితరులు నటించారు. ఇక ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఇక ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు. ఇక మూవీతో మరోసారి లోకేష్ కనగరాజ్ హిట్ కొట్టేశారని అంటున్నారు.
ఇక లియో బిజినెస్ విషయానికి వస్తే... తెలుగు రాష్ట్రాల్లో.... ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాలను కలుపుకుని ఈ చిత్రం రూ. 16 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. ' తమిళనాడులో రూ. 100 కోట్లు, కర్నాటకలో రూ. 15.50 కోట్లు, హిందీ ప్లస్ నార్త్ ఇండియా మొత్తంలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 13.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 60 కోట్లు బిజినెస్ నమోదు చేసుకుంది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 215 కోట్లు వ్యాపారం నమోదు చేసుకుంది.

విజయ్ లోకేష్ కనగరాజ్ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 215 కోట్లు బిజినెస్ నమోదు చేసుకుంది. దీంతో రూ. 215 కోట్లు షేర్ లేదా రూ. 410 కోట్లు గ్రాస్ వసూలు అయితేనే ఈ సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ఇక విజయ్ లియో చిత్రం ఇండియా వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. తమిళనాడులో రూ.32కోట్ల గ్రాస్.. కేరళలో రూ.12.50 కోట్ల గ్రాస్, కర్ణాటక రూ.14.50 కోట్లు గ్రాస్, తెలుగు రాష్ట్రాల్లో 17 కోట్లు గ్రాస్, రెస్ట్ ఆఫ్ ఇండియాలో రూ.4కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రెడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి. ఇక ఇండియా వైడ్ గా రూ.80కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు అంఛనా.
ఇక ఓవర్సీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. విజయ్ లియో సినిమా అక్కడ మొదటి రోజు రూ.65 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక వరల్డ్ వైడ్ గా విజయ్ కనగరాజ్ సినిమా రూ.145 కోట్లు వసూలు చేస్తుందని ట్రెడ్ లెక్కలు చెబుతున్నాయి. ఇక ఈ సినిమా హిట్ అవ్వాలంటే... 410 కోట్లు గ్రాస్ రాబట్టాలి. ఇప్పటికే రూ. 145 కోట్లు రాబట్టిందంటే... ఇంకో రెండు రోజుల్లో ఈ సినిమా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకోనుందని అంటున్నారు. చూడాలి మరి.


Click it and Unblock the Notifications











