LEO 16 Days Collections: రూ.215 కోట్ల సినిమా.. 16రోజుల్లోనే అన్ని కోట్లా.. లాభం ఏంతో తెలిస్తే షాకే!

ఇళయదళపతి విజయ్.. సౌత్ హీరో అయినప్పటికీ.. ఆయనకు దేశవ్యాప్తంగా ఫ్యాన్స్ తోపాటు.. ఫుల్ క్రేజ్ అయితే ఉంది. తాజాగా ఆయన లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న రిలీజ్ అయింది. ఇక ఈ చిత్రానికి ఆరంభం నుంచే అదిరిపోయే స్పందన లభించింది. ఇలా ఈ చిత్రం 16 రోజుల్లో సంచలన వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో 'లియో' మూవీకి 16 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు మీరే చూడండి!

తమిళ స్టార్ విజయ్ హీరోగా నటించిన తాజా సినిమా 'లియో'. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది.

 Vijay Lokesh Kangaraj Leo Movie 16 Days World Wide Collections

విజయ్ నటించిన లియో సినిమా 16 రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ గమనిస్తే... నైజాం రూ.9.99 కోట్లు, సీడెడ్ రూ.4.66 కోట్లు, UA రూ.3.10 కోట్లు, తూర్పు రూ.1.98 కోట్లు, పశ్చిమ రూ.1.05 కోట్లు, గుంటూరు రూ.1.86 కోట్లు, కృష్ణ రూ.1.64 కోట్లు, నెల్లూరు రూ.1.17 కోట్లు రాబట్టింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా రూ.25.45 షేర్ ( రూ.46.15 కోట్ల గ్రాస్) వసూలు చేసింది.

 Vijay Lokesh Kangaraj Leo Movie 16 Days World Wide Collections

లియో సినిమా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో వ్యాపారం రూ.16 కోట్ల వ్యాపారం చేసుకోగా... బ్రేక్ ఈవెన్ రూ.17.00 కోట్లుగా బిజినెస్ నమోదు చేసుకుంది. సినిమా మొత్తం లాభం - ఇప్పటికి రూ.8.45 కోట్ల లాభంతో తెలుగు రాష్ట్రాల్లో సూపర్ హిట్టుగా నిలిచింది.

లియో 16 రోజుల టోటల్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ గమనిస్తే.. తమిళనాడు రూ.197.65 కోట్లు, తెలుగు రాష్ట్రాలు రూ.46.15 కోట్లు, కర్ణాటక రూ.38.65 కోట్లు, కేరళ రూ.57.05 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ.34.00కోట్లు రాబట్టింది. ఇక ఓవర్సీస్ లో రూ.184.15 కోట్లు రాబట్టాగా... మొత్తంగా వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే... రూ.557.65కోట్ల గ్రాస్ (రూ. 280.50 కోట్ల షేర్) రాబట్టింది.

 Vijay Lokesh Kangaraj Leo Movie 16 Days World Wide Collections

లియో మూవీ టోటల్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తే.. తమిళనాడు - రూ.100 కోట్లు, తెలుగు రాష్ట్రాలు- రూ.16 కోట్లు, కర్ణాటక- రూ.15.50 కోట్లు, కేరళ - రూ.13.50 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా - రూ.10 కోట్లు, ఓవర్సీస్ - రూ.60 కోట్లు కాగా... లియో సినిమా మొత్తం వరల్డ్ వైడ్ బిజినెస్ రూ215 కోట్లు జరుపుకుంది. బ్రేక్ ఈవెన్ రూ.216 కోట్లతో బాక్సాఫీస్ బరిలో దిగింది. ఇక ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ ఇప్పటికే పూర్తి చేసుకోగా.. రూ.64.50 కోట్ల లాభంతో దూసుకుపోతుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X