Leo Box Office Collections: బాక్సాఫీస్ వద్ద లియో రికార్డ్స్... 2 రోజుల్లో ఎంత కలెక్షన్స్ రాబట్టిందంటే?
దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో వచ్చిన చిత్రమే లియో. ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా ఎట్టకేలకు అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా మొదటి రోజు రూ.140 కోట్లకు పైగా సాధించగా.. రెండో రోజు కాస్త డ్రాప్ అయినట్లు తెలుస్తోంది. రెండో రోజు కలెక్షన్స్ రిపోర్ట్ ఓసారి గమనిస్తే...

లియో సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే... నైజాం రూ.3.46 కోట్లు, సీడెడ్ రూ.1.58 కోట్లు, ఉత్తరాంధ్ర రూ.91లక్షలు, తూర్పు ఆంధ్ర 62 లక్షలు, పశ్చిమ రూ.28 లక్షలు, గుంటూరు రూ.67లక్షలు, కృష్ణ రూ.44 లక్షలు, నెల్లూరు రూ.35లక్షలు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా లియో.. రూ. 8.31 కోట్ల షేర్ రాబట్టగా... రూ.15.60 కోట్ల గ్రాస్ వచ్చింది.
తెలుగు రాష్ట్రాల్లో లియో బిజినెస్ విషయానికి వస్తే... రూ.16కోట్లు నమోదు చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో లియో హిట్ అవ్వాలంటే.. రూ.17 షేర్ కోట్లు రాబట్టాలి. ఇక రెండోరోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ విషయానికి వస్తే... లియో సినిమా రూ.3.6 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది. రెండు రోజుల కలెక్షన్స్ కలిపితే తెలుగులో లియో 11 కోట్ల రూపాయల వరకు షేర్ రాబట్టింది. ఇక ఈ సినిమా హిట్ కావాలంటే.. ఇంకో రూ.4 కోట్లు రాబట్టాలి.

లియో మొదటి రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ విషయానికి వస్తే... తమిళనాడు రూ.35.45 కోట్లు, తెలుగు రాష్ట్రాలు రూ.15.60 కోట్లు, కర్ణాటక రూ.13.65 కోట్లు, కేరళ రూ.11.90 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 4.35 కోట్లు, ఓవర్సీస్ రూ. 65.15 కోట్లు వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా మొదటి రోజు కలెక్షన్స్ చూస్తే... రూ.146.15 కోట్ల గ్రాస్ రాబట్టగా... (రూ.73.70 కోట్ల షేర్) వసూలు చేసింది.

లియో సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ విషయానికి వస్తే... రూ. 215 కోట్ల వ్యాపారం చేసుకోగా... బ్రేక్ ఈవెన్ రూ.216 కోట్లు బిజినెస్ చేసుకుంది. అయితే ఈ సినిమా హిట్ అవ్వాలంటే.. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 216 కోట్లు రాబట్టాలి. మొదటి రోజు లియో సినిమా రూ.73.70 కోట్లు రాబట్టింది. ఇక రెండో రోజు విషయానికి వస్తే.. ఈ సినిమా రూ.65 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది.
మొత్తంగా రెండో రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే... లియో సినిమా 200 కోట్లకు పైగా సాధించినట్లు అర్థం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకుపైగా కలెక్షన్ల గ్రాస్ రాబడితే.. ఈ సినిమా హిట్ అయినట్లు అవుతుంది. ఇక మరో 200 కోట్ల గ్రాస్ రాబడితే.. ఈ సినిమా హిట్ అయినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











