Leo Day 3 Collections: దుమ్ములేపుతున్న విజయ్ లియో... 3 రోజుల్లో అన్ని వందల కోట్లా?

దళపతి విజయ్, దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబోలో వచ్చిన సినిమా లియో. ఈ సినిమాపై విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్నసంగతి తెలిసిందే. ఈ చిత్రం దసరా కానుకగా... అక్టోబర్ 19వ తేదీన థియేటర్లోకి వచ్చేసింది. ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో పాన్ ఇండియా లెవెల్ రిలీజ్ అయింది. ఇక ఈ సినిమా రెండు రోజుల్లో రూ.200 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించగా.. మూడో రోజు కలెక్షన్స్ రిపోర్ట్ ఓసారి గమనిస్తే...

తమిళ సూపర్ స్టార్ విజయ్, అందాల భామ త్రిష నటించిన చిత్రం లియో అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమాలో మడొన్నా సెబాస్టియన్, ప్రియా ఆనంద్ కీలక పాత్రల్లో నటించారు. బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్, సౌత్ ఇండియన్ స్టార్ అర్జున్ సర్జా తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా తొలి రోజే 140 కోట్లు రాబట్టి రికార్టు సృష్టించింది. ఇక రెండురోజుల్లో రెండు వందల కోట్లు రాబట్టింది. ఇక ఈ సినిమాకు లలిత్ కుమార్ 300 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు. అనిరుద్ సంగీతం అందించారు.

Vijay Lokesh Kangaraj Leo Movie Day 3 Official Collections Worldwide Full Details Here

విజయ్,లోకేష్ కనగరాజ్ లియో సినిమా రెండు రోజుల తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే... నైజాం రూ.4.70 కోట్లు, సీడెడ్ రూ.2.20కోట్లు, ఉత్తరాంధ్ర రూ1.25 కోట్లు, తూర్పు ఆంధ్ర 83లక్షలు, పశ్చిమ రూ.43 లక్షలు, గుంటూరు రూ.85లక్షలు, కృష్ణ రూ.66 లక్షలు, నెల్లూరు రూ.48 లక్షలు వసూలు చేసింది. ఇక తెలుగు రాష్ట్రాల్లో మొత్తంగా లియో.. రూ. 11.40 కోట్ల షేర్ రాబట్టగా... రూ.21.05 కోట్ల గ్రాస్ వచ్చింది.

లియో మూవీ తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ విషయానికి వస్తే... మొదటి రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ.8.31 కోట్లు రాబట్టగా...రెండో రోజు రూ. 3.09 కోట్లు రాబట్టింది. మొత్తంగా రెండు రోజుల్లో లియో సినిమా రూ.11.40 కోట్ల షేర్ రాబట్టగా... రూ.21.05 కోట్ల గ్రాస్ రాబట్టింది.

Vijay Lokesh Kangaraj Leo Movie Day 3 Official Collections Worldwide Full Details Here

తెలుగు రాష్ట్రాల్లో లియో బిజినెస్ విషయానికి వస్తే... రూ.16కోట్లు నమోదు చేసుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో లియో హిట్ అవ్వాలంటే.. రూ.17 షేర్ కోట్లు రాబట్టాలి. ఇక మూడో రోజు తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్స్ విషయానికి వస్తే... లియో సినిమా రూ.2.6 కోట్ల షేర్ రాబట్టిందని తెలుస్తోంది. మూడు రోజుల కలెక్షన్స్ కలిపితే తెలుగులో లియో 14 కోట్ల రూపాయల వరకు షేర్ రాబట్టింది. ఇక ఈ సినిమా హిట్ కావాలంటే.. తెలుగు రాష్ట్రాల్లో ఇంకో రూ.3 కోట్లు రాబట్టాలి.

ఇక లియో వరల్డ్ వైడ్ రెండు రోజుల కలెక్షన్స్ విషయానికి వస్తే... తమిళనాడు రూ.60.25 కోట్లు, తెలుగు రాష్ట్రాలు రూ.21.05 కోట్లు, కర్ణాటక రూ.16.60 కోట్లు, కేరళ రూ.17.35 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా రూ. 6.55 కోట్లు, ఓవర్సీస్ రూ. 89.80 కోట్లు వసూలు చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా రెండు రోజుల రోజు కలెక్షన్స్ చూస్తే... రూ.211 కోట్ల గ్రాస్ రాబట్టగా... (రూ.106.75 కోట్ల షేర్) వసూలు చేసింది.

Vijay Lokesh Kangaraj Leo Movie Day 3 Official Collections Worldwide Full Details Here

లియో సినిమా వరల్డ్ వైడ్ బిజినెస్ విషయానికి వస్తే... రూ. 215 కోట్ల వ్యాపారం చేసుకోగా... బ్రేక్ ఈవెన్ రూ.216 కోట్లు బిజినెస్ చేసుకుంది. అయితే ఈ సినిమా హిట్ అవ్వాలంటే.. వరల్డ్ వైడ్ గా ఈ సినిమా రూ. 216 కోట్లు షేర్ రాబట్టాలి. రెండు రోజుల్లో లియో సినిమా రూ.106.75 కోట్ల షేర్ రాబట్టింది. ఇక మూడో రోజు విషయానికి వస్తే.. ఈ సినిమా రూ.65 కోట్ల గ్రాస్ రాబట్టినట్లు తెలుస్తోంది.

మొత్తంగా మూడో రోజు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ చూసుకుంటే... లియో సినిమా రూ 280కోట్లకు పైగా సాధించినట్లు అర్థం అవుతుంది. ప్రపంచవ్యాప్తంగా 400 కోట్లకుపైగా కలెక్షన్ల గ్రాస్ రాబడితే.. ఈ సినిమా హిట్ అయినట్లు అవుతుంది. ఇక మరో 120 కోట్ల గ్రాస్ రాబడితే.. ఈ సినిమా హిట్ అయినట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X