Master Movie Day 2 Collections: మాస్టర్‌కు భారీ షాక్.. తెలుగులో మాత్రం ఊహించని విధంగా!
తమిళ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు ఇళయదళపతి విజయ్. అయితే, అతడి ఖ్యాతి మాత్రం విశ్వవ్యాప్తం అయిందనే చెప్పాలి. దీనికి కారణం.. విలక్షణ నటనతో పాటు మాస్ హీరోగా పేరు దక్కించుకోవడమే. ఈ కారణంగానే తన ప్రతి సినిమానూ అన్ని ప్రాంతాల్లో విడుదల చేస్తూ కలెక్షన్లు రాబడుతున్నాడు. తద్వారా సినిమా సినిమాకూ మార్కెట్‌ను పెంచుకుంటున్నాడు. ఇలాంటి పరిస్థితుల్లో విజయ్ నటించిన 'మాస్టర్' రెండు రోజుల క్రితం విడుదలైంది. ఈ సినిమా మొదటి రోజు రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టింది. కానీ, రెండో రోజు మాత్రం షాక్ తగిలింది. ఆ వివరాలు మీకోసం!

మరో మాస్ సినిమాతో వచ్చిన విజయ్
'ఖైదీ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం 'మాస్టర్'. కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఈ సినిమాను ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్ బ్యానర్‌పై స్కేవియర్ బ్రిట్టో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

కోలీవుడ్‌లోనే కాదు.. అన్ని చోట్లా నిలిచి
రజినీకాంత్ తర్వాత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకడు. ఆయనకు కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమా ఎప్పుడు విడుదలైనా స్పందన భారీగా ఉంటోంది. ఇందులో భాగంగానే 'మాస్టర్'కు కూడా ఊహించని రీతిలో మార్కెట్ జరిగింది. మరీ ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాల్లో ఇది రిలీజ్ అయింది.

మారిన టాక్.. అయినా తగ్గని స్పందన
ఎన్నో అంచనాల నడుమ విడుదలైన మాస్టర్‌కు ప్రీమియర్ షోలలో మంచి స్పందన వచ్చింది. అయితే, మొదటి రోజు చివరకు టాక్ విషయంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఫస్టాఫ్ బాగుందని చెబుతున్న ప్రేక్షకులు.. సెంకాడాఫ్ మాత్రం సాగదీతగా ఉందని అంటున్నారు. ఫలితంగా సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమాకు స్పందన మాత్రం తగ్గలేదనే చెప్పాలి.

మొదటి రోజు మాస్టర్ ఇంత రాబట్టాడు
బుధవారం ప్రపంచ వ్యాప్తంగా 'మాస్టర్' మేనియానే కనిపించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ దక్కాయి. తమిళనాడులో రూ. 23 కోట్లు, కర్నాటకలో రూ. 3 కోట్లు, కేరళలో రూ. 3 కోట్లు, ఆంధ్రా+తెలంగాణలో రూ. 4.5 కోట్లు, భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల్లో రూ. 1.5 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 4 కోట్లతో మొత్తంగా రూ. 40 కోట్లు రాబట్టి సత్తా చాటింది.

రెండో రోజు విజయ్ మాస్టర్‌కు భారీ షాక్
మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా రికార్డు స్థాయి కలెక్షన్లు రాబట్టి సత్తా చాటింది మాస్టర్ మూవీ. అయితే, రెండో రోజు మాత్రం ఈ సినిమాకు భారీ షాక్ తగిలింది. ఫస్ట్ డే ఈ మూవీ రూ. 40 కోట్లకు పైగా సాధించగా.. రెండో రోజు మాత్రం రూ. 12 కోట్లతో సరిపెట్టుకుంది. అన్ని చోట్లా సంక్రాంతి సందర్భంగా 15న పలు సినిమాలు విడుదలయ్యాయి. ఈ కారణంగానే కలెక్షన్లు తగ్గిపోయాయి.

తెలుగులో మాత్రం ఊహించని విధంగా!
మిగిలిన అన్ని ప్రాంతాలతో పోలిస్తే తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే విజయ్‌కు భారీ స్థాయిలో మార్కెట్ ఉంది. అందుకు అనుగుణంగానే సొంత రాష్ట్రంలో ఈ మూవీ రెండో రోజు రూ. 12 కోట్లు వసూలు చేసింది. అలాగే, ఆంధ్రప్రదేశ్+తెలంగాణలో దాదాపు రూ. 4 కోట్ల వరకూ రాబట్టింది. అన్ని చోట్లా సగానికి సగం పడిపోయినా.. తెలుగులో మాత్రం విజయ్ హవాను చూపిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











