twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Master Collections: తెలుగులో మాస్టర్‌ రికార్డు.. కేవలం మూడు రోజుల్లోనే.. షాకిస్తోన్న లెక్కలు!

    |

    పేరుకు తమిళ హీరోనే అయినా.. దక్షిణాది మొత్తం మెచ్చే స్టార్‌గా వెలుగొందుతున్నాడు ఇళయదళపతి విజయ్. కెరీర్ ఆరంభంలోనే భారీ విజయాలను అందుకున్న అతడు.. తక్కువ సమయంలోనే విలక్షణ నటుడిగా గుర్తింపు పొందాడు. మరీ ముఖ్యంగా మాస్ ఆడియెన్స్ మన్ననలు పొందుతూ ఎంతో మంది అభిమానాన్ని అందుకున్నాడు. ఈ మధ్య వరుసగా విజయాలు అందుకుంటోన్న విజయ్.. తాజాగా 'మాస్టర్' అనే సినిమాతో వచ్చాడు. తాజాగా ఈ మూవీ తెలుగులో రికార్డును క్రియేట్ చేసింది. ఆ లెక్కలు చూసి అంతా షాకైపోతున్నారు. వివరాల్లోకి వెళ్తే..

    కాలేజ్ పొలిటికల్ డ్రామాతో వచ్చిన విజయ్

    కాలేజ్ పొలిటికల్ డ్రామాతో వచ్చిన విజయ్

    'ఖైదీ' వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ నటించిన చిత్రం 'మాస్టర్'. కాలేజ్ పొలిటికల్ డ్రామా నేపథ్యంతో తెరకెక్కిన ఈ మూవీలో మరో స్టార్ హీరో విజయ్ సేతుపతి విలన్‌గా నటించాడు. ఈ సినిమాను ఎక్స్‌బీ ఫిల్మ్ క్రియేటర్ బ్యానర్‌పై స్కేవియర్ బ్రిట్టో నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 13న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది.

    అతడి క్రేజ్‌కు ఈ మూవీ లోకేషన్లే నిదర్శనం

    అతడి క్రేజ్‌కు ఈ మూవీ లోకేషన్లే నిదర్శనం

    రజినీకాంత్ తర్వాత ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో విజయ్ ఒకడు. ఆయనకు కూడా ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అందుకే ఆయన సినిమా ఎప్పుడు విడుదలైనా స్పందన భారీగా ఉంటోంది. ఇందులో భాగంగానే 'మాస్టర్'కు కూడా ఊహించని రీతిలో మార్కెట్ జరిగింది. మరీ ముఖ్యంగా అమెరికా, ఆస్ట్రేలియా, మలేషియా వంటి దేశాల్లో ఇది రిలీజ్ అయింది.

    టాక్ అంతంతమాత్రం.. కలెక్షన్లు ఓ రేంజ్‌లో

    టాక్ అంతంతమాత్రం.. కలెక్షన్లు ఓ రేంజ్‌లో

    ఎన్నో అంచనాల నడుమ విడుదలైన మాస్టర్‌కు ప్రీమియర్ షోలలో మంచి స్పందన వచ్చింది. అయితే, మొదటి రోజు చివరకు టాక్ విషయంలో మార్పులు కనిపిస్తున్నాయి. ఫస్టాఫ్ బాగుందని చెబుతున్న ప్రేక్షకులు.. సెంకాడాఫ్ మాత్రం సాగదీతగా ఉందని అంటున్నారు. ఫలితంగా సినిమాకు ఏవరేజ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ ఈ సినిమాకు స్పందన మాత్రం తగ్గలేదనే చెప్పాలి.

     వంద కోట్ల క్లబ్‌లో మాస్టర్.. లాక్‌డౌన్ తర్వాత

    వంద కోట్ల క్లబ్‌లో మాస్టర్.. లాక్‌డౌన్ తర్వాత


    బుధవారం ప్రపంచ వ్యాప్తంగా 'మాస్టర్' మేనియానే కనిపించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమాకు అదిరిపోయే ఓపెనింగ్స్ దక్కాయి. మొదటి రోజు మొత్తంగా రూ. 40 కోట్లు రాబట్టి సత్తా చాటిందీ సినిమా. అలాగే, రెండో రోజు కూడా దాదాపు రూ. 30 కోట్లకు పైగానే వసూలు చేసింది. ఇక, మూడో రోజు కూడా రూ. 30 కోట్లకు పైగానే సాధించి వంద కోట్ల క్లబ్‌లో చేరింది.

    మాస్టర్‌ రికార్డు... కేవలం మూడు రోజుల్లోనే

    మాస్టర్‌ రికార్డు... కేవలం మూడు రోజుల్లోనే

    దక్షిణాదిలో తమిళనాడు తర్వాత తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను అందుకున్నాడు విజయ్. అలాగే, మార్కెట్‌ను కూడా గణనీయంగా పెంచుకున్నాడు. ఈ కారణంగానే తెలుగులో మాస్టర్ ఫస్ట్ డే రూ. 6.1 కోట్లు, రెండో రోజు రూ. 1.67 కోట్లు, మూడో రోజు రూ. 1.55 కోట్లు కలెక్ట్ చేసిందీ సినిమా. దీంతో మొత్తంగా రూ. 9.23 కోట్లు వసూలు చేసి రికార్డు క్రియేట్ చేసింది.

    నిర్మాతకు లాభాలు... షాకిస్తోన్న లెక్కలు

    నిర్మాతకు లాభాలు... షాకిస్తోన్న లెక్కలు

    మాస్టర్‌ను తెలుగులో మహేశ్ కోనేరు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమా హక్కులను ఆయన రూ. 8.5 కోట్లకు కొనుగోలు చేయగా.. కేవలం మూడు రోజుల్లోనే రూ. 9.23 కోట్లు వసూలు చేసింది. దీంతో నిర్మాతకు రూ. 73 లక్షల లాభాలను తెచ్చి పెట్టింది. టాక్ బాగోలేకున్నా ఓ రేంజ్‌లో కలెక్షన్లు రాబట్టుకుని క్లీన్ హిట్‌గా నిలవడంతో అంతా షాకవుతున్నారు.

    English summary
    Master is an upcoming Indian Tamil-language action-thriller film written and directed by Lokesh Kanagaraj, and produced by Xavier Britto, under the banner XB Film Creators. The film stars Vijay and Vijay Sethupathi, with Malavika Mohanan, Arjun Das, Andrea Jeremiah and Shanthanu Bhagyaraj in supporting roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X