Master box office: 6వ రోజు కూడా పవర్ఫుల్ కలెక్షన్స్.. విజయ్ మరో బిగ్గెస్ట్ రికార్డ్

జనవరి 13 న విడుదలైన మాస్టర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రం 6వ రోజు కూడా కలెక్షన్స్ అందుకోవడంలో ఏ మాత్రం తగ్గలేదు. ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ పై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి. అసలైతే 2020 సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ పాండమిక్ కారణంగా ఏడాది పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక మొత్తానికి మాస్టర్ సంక్రాంతి నాడు అందరికి లాభాలను అందించేశాడు.

Recommended Video

Master దూసుకుపోతున్నాడు.. Thalapathy Vijay మూవీ కి గ్రాండ్ ఓపెనింగ్ !

PICS: Indian Couples Viral Photoshoot Photos

 కొంచెం కూడా టెంప్ట్ అవ్వలేదు

కొంచెం కూడా టెంప్ట్ అవ్వలేదు

థియేటర్స్ ఓపెన్ కావడానికి చాలా సమయం పట్టేలా ఉందని అందరూ ఓటీటీ ఆఫర్స్ కు ఎట్రాక్ట్ అవుతున్న తరుణంలో అలాంటి ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా నిర్మాతలు థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు ఎదురుచూశారు. కొంచెం కూడా టెంప్ట్ అవ్వలేదు. కరోనా కష్ట కాలంలో వసూళ్లను ఎంతవరకు అందుకుంటుంది అనేది మొదట్లో అందరిని ఆందోళనకు గురి చేసింది.

ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందంటే

ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అయ్యిందంటే

లాక్ డౌన్ తరువాత విడుదలవుతున్న అతిపెద్ద సినిమా కాబట్టి అందరిచూపు బాక్సాఫీస్ కలెక్షన్స్ పైనే ఉంది. థియేటర్స్ లలో 100% సిట్టింగ్ కెపాసిటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం దక్కలేదు. కేవలం 50% ఆక్యుపెన్సీతో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనే విషయంలో అనేక రకాల అనుమానాలను క్రియేట్ అయ్యాయి. ఇక తమిళనాడులో 550 కి పైగా స్క్రీన్లలో అలాగే దక్షిణ భారతదేశంలోని ఇతర ప్రాంతాలలో 880కి పైగా స్క్రీన్లలో విడుదల చేశారు.

150కోట్ల వసూళ్లు..

150కోట్ల వసూళ్లు..


మొత్తానికి ప్రపంచవ్యాప్తంగా మాస్టర్ 6రోజుల్లోనే ఒక సరికొత్త రికార్డును అందుకుంది. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ ప్రకారం, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ .150 కోట్లకు పైగా వసూలు చేసింది. మొదటి వీకెండ్ లోనే అత్యధిక వసూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. కేవలం 50% ఆక్యుపెన్సీతో విడుదలై ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుందని అంటే ఒక పెద్ద వండర్ అనే చెప్పాలి.

నెగిటివ్ టాక్ వచ్చినా కూడా..

నెగిటివ్ టాక్ వచ్చినా కూడా..


పైగా విడుదలైన రోజే ప్లాప్ టాక్ దెబ్బ పడినట్లు టాక్ వచ్చింది. రివ్యూలు కూడా చాలా వరకు నెగిటివ్ గానే వచ్చాయి. అయితే ఆ టాక్ తో సంబంధం లేకుండా సినిమా తమిళంలో మొదటిరోజు 50కోట్ల వసూళ్లను అందుకుంది. ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా విజయ్ మొదటిసారి భారీ స్థాయిలో ఓపెనింగ్స్ ను అందుకున్నాడు. ఇక్కడ కూడా పెట్టిన పెట్టుబడికి మంచి లాభాలు వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X