Master box office: క్లోజింగ్ కలెక్షన్స్.. తెలుగులో విజయ్ డామినేషన్ మొదలైంది.. లాభం ఎంతంటే?

కోలీవుడ్ స్టార్ హీరోలు చాలా వరకు తెలుగులో క్రేజ్ అందుకున్నవారే. ఇక తెలుగులో మార్కెట్ సెట్ చేసుకోవడానికి విజయ్ కు మాత్రం చాలా సమయం పట్టింది. మొత్తానికి జనవరి 13న విడుదలైన మాస్టర్ బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఖైదీ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ పై మొదటి నుంచి కూడా అంచనాలు భారీగానే ఉన్నాయి.

అసలైతే 2020 సమ్మర్ లోనే సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సింది. కానీ కరోనా కారణంగా ఏడాది పాటు వాయిదా వేయాల్సి వచ్చింది. ఇక మొత్తానికి మాస్టర్ సంక్రాంతి నాడు వచ్చి అందరికి లాభాలను అందించేశాడు.

అలాంటి ఆఫర్స్ ఎన్ని వచ్చినా..

అలాంటి ఆఫర్స్ ఎన్ని వచ్చినా..

థియేటర్స్ ఓపెన్ కావడానికి చాలా సమయం పట్టేలా ఉందని అందరూ ఓటీటీ ఆఫర్స్ కు ఎట్రాక్ట్ అవుతున్న తరుణంలో అలాంటి ఆఫర్స్ ఎన్ని వచ్చినా కూడా నిర్మాతలు థియేటర్స్ ఓపెన్ అయ్యే వరకు ఎదురుచూశారు. కొంచెం కూడా ఓటీటీ ధరలకు ఆశ పడకుండా వేయిట్ చేశారు. కరోనా కష్ట కాలంలో వసూళ్లను ఎంతవరకు అందుకుంటుంది అనేది మొదట్లో అందరిని ఆందోళనకు గురి చేసింది. కానీ రెండు మూడు రోజుల్లోనే సినిమా భారీ స్థాయిలో లాభాలను అందించింది.

కేవలం 50% ఆక్యుపెన్సీతోనే..

కేవలం 50% ఆక్యుపెన్సీతోనే..

లాక్ డౌన్ తరువాత విడుదలవుతున్న అతిపెద్ద సినిమా కాబట్టి అందరిచూపు బాక్సాఫీస్ కలెక్షన్స్ పైనే ఉంది. థియేటర్స్ లలో 100% సిట్టింగ్ కెపాసిటీకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని కోరినప్పటికీ ఫలితం దక్కలేదు. కేవలం 50% ఆక్యుపెన్సీతో సినిమా కలెక్షన్స్ ఎలా ఉంటాయనే విషయంలో అనేక రకాల అనుమానాలను క్రియేట్ అయ్యాయి. ఇక తెలుగులో విజయ్ సినిమా మొదటిసారి అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది.

తెలుగులో వచ్చిన మొత్తం గ్రాస్..

తెలుగులో వచ్చిన మొత్తం గ్రాస్..

మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో మాస్టర్ తక్కువ రోజుల్లోనే ఒక సరికొత్త రికార్డును అందుకున్నాడు. ప్రముఖ ట్రేడ్ అనలిస్ట్ ప్రకారం, ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో 24 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ అందుకుంది. ఇక వరల్డ్ వైడ్ గా అయితే మొదటి వీకెండ్ లోనే అత్యధిక వసూళ్లు చేసిన తమిళ చిత్రంగా నిలిచింది. కేవలం 50% ఆక్యుపెన్సీతో విడుదలై ఈ రేంజ్ లో కలెక్షన్స్ అందుకుందని అంటే ఒక పెద్ద వండర్ అనే చెప్పాలి.

మొత్తం వచ్చిన లాభం ఎంతంటే..

మొత్తం వచ్చిన లాభం ఎంతంటే..

ఫైనల్ గా మాస్టర్ సినిమా ఓటీటీ లోకి వచ్చేసింది. దాదాపు అన్ని ఏరియాల్లో క్లోజింగ్ కలెక్షన్స్ లిస్ట్ కూడా వచ్చేసింది. ఇక మాస్టర్ తెలుగు రాష్ట్రాల్లో 8.5కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో విడుదలైంది. ఇక వచ్చిన టోటల్ షేర్ 14.60కోట్లు. ఇక 6కోట్ల వరకు సినిమా బయ్యర్ కు మంచి లాభాలనే అందించింది. మొత్తంగా తలపతి తెలుగులో ఒక బలమైన మార్కెట్ సెట్ చేసుకున్నాడని చెప్పవచ్చు. చూడాలి మరి భవిష్యత్తులో ఇంకా ఎలాంటి వసూళ్ళని అందుకుంటాడో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X