రికార్డు ధరకు విజయ్ 63 శాటిలైట్ హక్కులు.. దిమ్మతిరిగే రేటు.. రిలీజ్‌కు ముందే వసూళ్ల తుఫాన్!
తమిళ సూపర్‌స్టార్ విజయ్ వరుస సక్సెస్‌లు, సినిమాలతో జోష్ కొనసాగిస్తున్నారు. సర్కార్ సినిమా తర్వాత తన 63వ చిత్రం కోసం దర్శకుడు అట్లీతో జతకట్టారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన తెరీ, మెర్సల్ చిత్రాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ రూపొందిస్తున్నది. ఇంకా షూటింగ్ దశలోనే ఉన్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులు రికార్డు ధరకు అమ్ముడుపోవడం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే..

శాటిలైట్ హక్కులకు రికార్డు ధర
విజయ్ 63 చిత్రం చెన్నైలో శరవేగంగా షూటింగ్ జరుగుతున్నది. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటిస్తున్నది. ఈ సినిమా హక్కులను సన్ టీవీ భారీ మొత్తం చెల్లించి సొంతం చేసుకొన్నది. మీడియా కథనాల ప్రకారం.. ఈ చిత్రం శాటిలైట్ హక్కులు రూ.60 కోట్లకు అమ్ముడుపోయాయని సమాచారం.

హ్యాట్రిక్ దిశగా అట్లి, విజయ్
ఇంకా పేరు పెట్టని విజయ్ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కుల కోసం పలు సంస్థలు భారీగానే పోటీ పడుతున్నాయి. అమెజాన్ ప్రైమ్ ఈ సినిమా రైట్స్‌ను సొంతం చేసుకోవడానికి సిద్ధమైనట్టు సమాచారం. అట్లీ, విజయ్ కాంబినేషన్‌లో వస్తున్న మూడో చిత్రం కావడంతో సినిమాపై భారీ అంచనాలు పెరిగాయి.

రూ.250 కోట్ల వసూళ్లు
ఇటీవల విడుదలైన విజయ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టాయి. మెర్సల్, సర్కార్ చిత్రం రూ.250 కోట్లుపైనే వసూలు చేశాయి. దాంతో ఈ కాంబినేషన్‌లో వచ్చే సినిమా క్రేజీగా మారింది. మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

స్పోర్ట్స్ కోచ్‌గా నటిస్తున్న విజయ్
విజయ్ తన కెరీర్‌లో 63వ చిత్రంగా రూపుదిద్దుకొంటున్న సినిమా క్రీడా నేపథ్యంతో తెరకెక్కుతున్నది. ఈ చిత్రంలో విజయ్ స్పోర్ట్స్ కోచ్‌గా నటిస్తున్నారు. ఏఆర్ రెహ్మన్ సంగీతం వహిస్తున్న ఈ చిత్రంలో వివేక్, యోగిబాబు, ఇందుజా, కదీర్ తదితరులు నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











