Beast day 1 collections: నెగిటివ్ టాక్‌లో కూడా దుమ్మురేపుతున్న బీస్ట్.. బాక్సాఫీస్ వద్ద విజయ్ రచ్చ
తమిళ సూపర్ స్టార్ దళపతి విజయ్, యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కాంబినేషన్‌లో బీస్ట్ మూవీ భారీ అంచనాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రం రిలీజ్‌కు ముందు ఉన్న హైప్‌ను, అంచనాలను మించి ఉండకపోవడంతో ఈ సినిమా మార్నింగ్ షో తర్వాత నెగిటివ్ జోన్‌లోకి వెళ్లింది. అయితే బాక్సాఫీస్ వద్ద విజయ్ స్టామినాకు తగినట్టుగానే భారీ వసూళ్లను తొలి రోజు నమోదు చేసింది. తొలి రోజు బీస్ట్ సినిమా కలెక్షన్ల అంచనా ఎలా ఉందంటే..

తొలి ఆట తర్వాత నెగిటివ్ టాక్
నెల్సన్ కుమార్ రూపొందించిన బీస్ట్ చిత్రం యాక్షన్ థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా కథ, కథనాలు, సన్నివేశాలు నాసిరకంగా ఉండటం ప్రేక్షకుల సహానానికి పరీక్ష పెట్టినట్టు ఉంది. అయితే విడుదలైన ప్రతీ ప్రాంతంలో ఈ సినిమాకు ప్రతికూల టాక్ రావడం అభిమానులను నిరుత్సాహ పరిచించింది. అయితే తొలి రోజున ఊహించని వసూళ్లను రాబట్టం గమనార్హం.

అమెరికాలో రికార్డు వసూళ్లు
అమెరికాలో బీస్ట్ చిత్రం భారీ ఒపెనింగ్స్ సాధించింది. దళపతి విజయ్ కెరీర్‌లోనే అత్యంత భారీ ఒపెనింగ్స్ సాధించిన చిత్రంగా రికార్డును నెలకొప్పలింది. ఈ చిత్రం తొలిరోజున $750,000 అంటే భారతీయ కరెన్సీలో 5.7 కోట్లు వసూలు చేసింది.

సింగపూర్‌లో విజయ్ రచ్చ
విజయ్ నటించిన బీస్ట్ చిత్రం సింగపూర్‌లోను రికార్డు కలెక్షన్లు నమోదు చేసింది. సింగపూర్ బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం 300k సింగపూర్ డాలర్లను వసూలు చేయడం రికార్డుగా చెప్పుకొంటున్నారు. విజయ్ కెరీర్‌లో ఇదే అత్యుత్తమ కలెక్షన్ రిపోర్ట్. ఆల్ టైమ్ రికార్డు అని సినీ, ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

తమిళనాడులో కబాలీ రికార్డు బ్రేక్
ఇక తమిళనాడులో విజయ్ హవా కొనసాగుతున్నది. తొలి రోజున ఏకంగా 18.75 కోట్లు రాబట్టింది. విజయ్ కెరీర్‌లో ఇదే హయ్యెస్ట్ కలెక్షన్లు కావడం విశేషం. అయితే ప్రతికూల రిపోర్టులను అధిగమించి భారీ వసూళ్లను నమోదు చేయడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు ఎంతంటే?
ఇక ప్రతికూల రివ్యూలు, సినీ విమర్శకులు అభిప్రాయాలను ఎదురించి బీస్ట్ చిత్రం రికార్డు కలెక్షన్లు నమోదు కానున్నది. తొలి రోజున ప్రపంచవ్యాప్తంగా రూ.85 నుంచి 90 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది. అయితే తొలి రోజున రజనీకాంత్ నటించిన కబాలీ చిత్రం రికార్డును అధిగమించడం విశేషంగా మారింది.


Click it and Unblock the Notifications