twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగిల్ క్లోజింగ్ కలెక్షన్లు: విజయ్ సినిమా తెలుగులో హిట్టా? ఫట్టా?

    |

    తమిళ సూపర్‌స్టార్ విజయ్ నటించిన బిగిల్ (తెలుగులో విజిల్) బాక్సాఫీస్ విజయయాత్ర ముగిసింది. అక్టోబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తమిళంలోనే కాకుండా ఏపీ, తెలంగాణలో మంచి వసూళ్లను రాబట్టింది. అంతేకాకుండా బలమైన కథ, కథనాలతో విజయ్ ఫ్యాన్స్‌ను బ్రహ్మండంగా ఆలరించింది. ఈ చిత్రం తుది కలెక్షన్లు ఎలా ఉన్నాయంటే..

     తెలుగు రాష్ట్రాల్లో

    తెలుగు రాష్ట్రాల్లో

    మాస్ ఎలిమెంట్స్ పుష్కలంగా ఉన్న విజిల్ చిత్రానికి ప్రేక్షకుల ఆదరణ భారీగానే వ్యక్తమైంది. నైజాంలో ఈ చిత్రం రూ.3.27 కోట్లు, సీడెడ్‌లో రూ.2.8 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.1.35 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.69 లక్షలు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.58 లక్షలు, గుంటూరులో రూ.95 లక్షలు, కృష్ణా జిల్లాలో రూ.76 లక్షలు, నెల్లూరులో రూ.51 లక్షలు వసూలు చేసింది.

    100 శాతానికిపైగా రాబడి

    100 శాతానికిపైగా రాబడి

    తెలుగు రాష్ట్రాల్లో విజిల్ చిత్రం రూ.20.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేసింది. దాంతో రూ.10.91 కోట్ల షేర్‌ను డిస్టిబ్యూటర్లకు పంచిపెట్టింది. అంటే ఈ చిత్ర ప్రీరిలీజ్ బిజినెస్ రూ.9.75 కోట్లు కాగా, దాదాపు పూర్తిస్థాయిలో 100 శాతానికి పైగా వసూళ్లను రాబట్టి హిట్ చిత్రంగా నిలిచింది. గతంలో విజయ్ నటించిన అదిరింది, సర్కార్ చిత్రాల బాటలోనే వసూళ్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకొన్నది.

     తమిళనాడులో రికార్డుస్థాయి వసూళ్లు

    తమిళనాడులో రికార్డుస్థాయి వసూళ్లు

    ఇక తమిళనాడులో బిగిల్ సినిమాకు ఎదురే లేకుండా పోయింది. సొంత రాష్ట్రంలో విజయ్ ఏకంగా రూ.138 కోట్ల వసూళ్లను రాబట్టారు. ఇక కర్ణాటకలో ఈ చిత్రం రూ.19.11 కోట్లు, కేరళలో రూ.19.1 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో రూ.4.05 కోట్లు వసూలు చేసింది. దాంతో ప్రపంచవ్యాప్తంగా రూ.200 కోట్లకుపైగా గ్రాస్‌ను నమోదు చేసింది.

    ఓవర్సీస్‌లో దుమ్మురేపిన విజయ్

    ఓవర్సీస్‌లో దుమ్మురేపిన విజయ్

    ఇక ఓవర్సీస్‌లో అన్ని భాషల్లో బిగిల్ చిత్రానికి మంచి ఆదరణ లభించంది. ఓవర్సీస్‌లో రూ.89 కోట్ల వసూళ్లు సాధించింది. దాంతో ఈ చిత్రం రూ.290 కోట్ల వసూళ్లను బాక్సాఫీస్ వద్ద నమోదు చేసింది. ఇక ఈ చిత్రానికి రూ.134 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరిగితే.. రూ.151 షేర్ రాబట్టింది. దాంతో సూపర్ హిట్‌ను ఖాతాలో విజయ్ వేసుకోవడం జరిగింది.

    Recommended Video

    #CineBox : Balakrishna Suggestions To Boyapati Sreenu For Their Upcoming Film !
    ప్రీ రిలీజ్ బిజినెస్

    ప్రీ రిలీజ్ బిజినెస్

    బిగిల్, విజయ్ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ప్రాంతాల వారీగా ఇలా ఉన్నాయి. తమిళనాడులో రూ.83.5 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగితే.. ఏపీ, తెలంగాణలో రూ.10.25 కోట్లు, కర్ణాటకలో రూ.8 కోట్లు, కేరళలో రూ.3 కోట్లు, ఇతర రాష్ట్రాల్లో రూ.1.25 కోట్లు, ఓవర్సీస్‌లో రూ.28 కోట్లతో మొత్తంగా రూ.134 కోట్ల మేర బిజినెస్‌ను నమోదు చేసింది.

    English summary
    Thalapathy Vijay's Bigil movie doing fantasting at world box office. This movie collected Rs.290 crores world wide.this movie is directed by Atlee.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X