ఒకే రోజు : ఒకటి డబ్బింగ్...ఇంకోటి రీమేక్

By Srikanya

హైదరాబాద్: ఓ చిత్రం విడుదల అవుతోందంటే అదే రోజు ఇంకేం చిత్రాలు విడుదల అవుతున్నాయి..వాటిలో తమకు పోటీగా ఏ చిత్రాలు ఉండబోతున్నాయి అని దర్శక,నిర్మాతలు అంచనావేసుకుని దిగుతారు. ఎందుకంటే ఒకే తరహా చిత్రాలు రెండు రిలీజ్ అయితే ప్రేక్షకులు డీవియేట్ అవుతారు. అలాగే పెద్ద సినిమా రిలీజ్ ఉంటే జనం అటు వెళ్ళిపోతారు. ఇప్పుడు అలాంటి సమస్యే కరెంట్ తీగ చిత్రానికి వచ్చింది. ఆ చిత్రానిక పోటీగా అదే రోజున మరో బారీ చిత్రం కత్తి విడుదల అవుతోంది. అది రీమేక్ చిత్రమే అయినా ఆ చిత్రంపైనా మంచి అంచనాలే ఉన్నాయి.

ఇప్పుడు అందరి దృష్టీ మరో భారీ చిత్రం కత్తిపై ఉంది. విజయ్, మురగదాస్ కాంబినేషన్ లో రూపొందిన ఈ చిత్రం మొదట దీపావళి రోజు విడుదల అనుకున్నారు కానీ ఇప్పుడు దాన్ని ఓ వారం ముందుక తోసారు. దీపావళి రోజు ఆడియోని విడుదల చేసి, అక్టోబర్ 31న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్ణయించారు. అయితే అదే రోజు తెలుగలో కరెంటు తీగ చిత్రం విడుదల అవుతోంది. కరెంట్ తీగ చిత్రం కూడా తమిళ రీమేక్ కావటం విశేషం.

మురగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన 'తుపాకి' తెలుగులోనూ బాగానే ఆడింది. దాంతో వీరి కాంబినేషన్ లో వస్తున్న కత్తి చిత్రంపై అంచనాలు పెరిగాయి. దాంతో తెలుగు వెర్షన్ ని ఠాగూర్ మధు అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్‌ సంస్థ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 12న ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేయనున్నారు.

చిత్ర సమర్పకుడు ఠాగూర్‌మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్‌ తరహాలో సాగే కథలో కమర్షియల్‌ హంగులన్నీ ఉంటాయి. 'కొలవెరి'.. అనిరుధ్‌ పాటల్ని అందించారు. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.

Vijay's Katti , Manoj's Current Teege release same day

తమిళంలో విజయ్‌కి ఉన్న క్రేజ్‌ అంతా ఇంతా కాదు. కానీ తెలుగులోనే అభిమానుల్ని సంపాదించుకోలేకపోయాడు. ఆలోటు 'తుపాకి' సినిమా తీర్చింది. ఆ చిత్రానికి మురుగదాస్‌ దర్శకుడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి జతకట్టారు. అదే.. 'కత్తి'. సమంత హీరోయిన్. బాలీవుడ్‌ నటుడు నితిన్‌ ముఖేష్‌ కీలక పాత్ర పోషించాడు. ఛాయాగ్రహణం: జార్జ్‌ సి.విలియమ్స్‌, కూర్పు: ఎ.శ్రీకర్‌ప్రసాద్‌.

విజయ్‌, ఏఆర్‌ మురుగదాస్‌ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'తుపాకి' ఏకంగా రూ. 130 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో 'కత్తి'ని రూ.150కోట్లపై టార్గెట్‌ చేసినట్లు కోలీవుడ్‌ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ దశలోనే 'కత్తి' సినిమాపై విపరీతమైన బిజినెస్ జరుగుతోంది. ఇందులో బాలీవుడ్‌ హీరో నీల్‌ నితిన్‌ ముకేష్‌ విలన్‌గా నటించారు.

ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్‌. ప్రస్తుతం వీరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్‌ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్‌ తెలిపారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X