Don't Miss!
- Sports లేడీ ఫ్యాన్ అందాన్ని చూసి కంట్రోల్ తప్పిన గిల్ Video
- Technology షియోమీ ప్రత్యేక ఈవెంట్.. బడ్స్ 5A, ప్యాడ్ SE సహా కీలక ఉత్పత్తుల విడుదల.. పూర్తి వివరాలు..!
- Finance Cerlec News: మీరూ మీ పిల్లలకు సెరెలాక్ ఆహారంగా ఇస్తున్నారా.? షాకింగ్ వార్త తెలుసుకోండి..
- News మళ్లీ బయటపడ్డ ఈవీఎం మోసం ! ఏ బటన్ నొక్కినా బీజేపీకే ఓటు...?
- Automobiles రూ. 150 కే విమాన టికెట్.. ట్రైన్ జర్నీ కంటే చాలా చీప్.. ఈ స్కీమ్ గురించి మీకు తెలుసా.??
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
ఠాగూర్ మధు రిలీజ్ చేస్తున్నాడు
హైదరాబాద్: మురగదాస్, విజయ్ కాంబినేషన్ లో వచ్చిన 'తుపాకి' తెలుగులోనూ బాగానే ఆడింది. దాంతో వీరి కాంబినేషన్ లో వస్తున్న కత్తి చిత్రంపై అంచనాలు పెరిగాయి. దాంతో తెలుగు వెర్షన్ ని ఠాగూర్ మధు అందిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ బ్యానర్ పై ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈనెల 12న ఈ చిత్రంలోని పాటల్ని విడుదల చేయనున్నారు.
చిత్ర సమర్పకుడు ఠాగూర్‌మధు మాట్లాడుతూ ''థ్రిల్లర్ తరహాలో సాగే కథలో కమర్షియల్ హంగులన్నీ ఉంటాయి. 'కొలవెరి'.. అనిరుధ్ పాటల్ని అందించారు. దీపావళికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాము''అన్నారు.
తమిళంలో విజయ్‌కి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. కానీ తెలుగులోనే అభిమానుల్ని సంపాదించుకోలేకపోయాడు. ఆలోటు 'తుపాకి' సినిమా తీర్చింది. ఆ చిత్రానికి మురుగదాస్ దర్శకుడు. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి జతకట్టారు. అదే.. 'కత్తి'. సమంత హీరోయిన్. బాలీవుడ్ నటుడు నితిన్ ముఖేష్ కీలక పాత్ర పోషించాడు. ఛాయాగ్రహణం: జార్జ్ సి.విలియమ్స్, కూర్పు: ఎ.శ్రీకర్‌ప్రసాద్.
విజయ్, ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్లో గతంలో వచ్చిన 'తుపాకి' ఏకంగా రూ. 130 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది. ఈ నేపథ్యంలో 'కత్తి'ని రూ.150కోట్లపై టార్గెట్ చేసినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. నిర్మాణ దశలోనే 'కత్తి' సినిమాపై విపరీతమైన బిజినెస్ జరుగుతోంది. ఇందులో బాలీవుడ్ హీరో నీల్ నితిన్ ముకేష్ విలన్‌గా నటించారు. దీపావళికి సినిమాను తెరపైకి తీసుకురానున్నట్లు సమాచారం.
ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలోని 'తుపాకి'తో తెలుగు, తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు 'ఇలయ దళపతి' విజయ్. ప్రస్తుతం వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం 'కత్తి'. విజయ్‌కి ఉన్న మాస్ ఇమేజ్‌కు తగ్గట్టు శీర్షిక కూడా కుదరడంతో.. ఈ సినిమాపై అంచనాలు పెరిగాయి. విజయ్‌ని మరో కొత్త కోణంలో చూపించనున్నట్లు ఇప్పటికే మురుగదాస్ తెలిపారు. గతంలో వీరి కాంబినేషన్లోని 'తుపాకి' దీపావళికి విడుదలై పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. అదే సెంటిమెట్‌తో ఈసారి కూడా 'కత్తి'ని పదునెక్కించి దీపావళి కదనరంగంలోకి దింపేందుకు సిద్ధమవుతున్నారు విజయ్.