twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Master Closing Collections: 33వ రోజు కూడా తమిళనాట ప్రభంజనం.. ఏపీ, తెలంగాణలో లాభమెంతంటే!

    |

    ఇళయ దళపతి విజయ్, మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి కాంబినేషన్‌లో వచ్చిన మాస్టర్ చిత్రం తమిళనాడులో భారీ కలెక్షన్లతో రికార్డులు సృష్టిస్తున్నది. సంక్రాంతి కానుకగా జనవరి 13వ తేదీన రిలీజైన ఈ చిత్రం తమిళనాడులో విజయఢంకా మోగిస్తున్నది. తమిళనాడు, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఎంత వసూలు చేసిందంటే..

     100 కోట్ల క్లబ్‌లో మాస్టర్

    100 కోట్ల క్లబ్‌లో మాస్టర్

    లోకేశ్ కనకరాజ్ దర్శకత్వం వహించిన మాస్టర్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డు వసూళ్లను సాధించింది. తమిళనాడులో రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఐదు రోజుల్లోనే ఈ చిత్రం 101 కోట్ల నికర వసూళ్లను సాధించింది.

    33వ రోజు కూడా అదే ఊపు

    33వ రోజు కూడా అదే ఊపు

    మాస్టర్ చిత్రం 33వ రోజుల తర్వాత కూడా అదే ఊపు కొనసాగిస్తున్నది. తమిళనాడులో రూ.125 కోట్లు రాబట్టింది. చెన్నై నగరంలో 33వ రోజున రూ.11.56 కోట్లు వసూలు చేయడం ఓ రికార్డుగా చెప్పుకొంటున్నారు. ఈ చిత్రం విజయ్ నటించిన తెరీ చిత్ర వసూళ్లను అధిగమించింది.

    తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

    తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు

    మాస్టర్ క్లోజింగ్ కలెక్షన్ల విషయానికి వస్తే నైజాంలో ఈ చిత్రం రూ.3.56 కోట్లు, సీడెడ్‌లో రూ.2.75 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ.2.51 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో రూ.1.34 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో రూ.1.25 కోట్లు, గుంటూరు జిల్లాలో రూ.1.41 కోట్లు, కృష్ణా జిల్లాలోరూ.1.17 కోట్లు, నెల్లూరులో రూ.65 కోట్లు వసూలు చేసింది.

    ఏపీ, తెలంగాణలో ఎంత లాభమంటే

    ఏపీ, తెలంగాణలో ఎంత లాభమంటే

    మాస్టర్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.8 కోట్ల మేర జరిగింది. బ్రేక్ ఈవెన్ స్థితికి రావడానికి రూ.8.5 కోట్ల మేరకు వసూళ్ల టార్గెట్‌ సెట్ చేసింది. అయితే ఏపీ, తెలంగాణలో ఈ చిత్రం రూ.14.60 కోట్ల నెట్ వసూళ్లను, రూ.24.80 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ చిత్రం రూ.6 కోట్ల లాభాన్ని నమోదు చేసింది.

    English summary
    Vijay's Master movie worldwide closing collections
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X