బాక్సాఫీస్ అదిరేలా మాస్టర్ ప్రీ రిలీజ్ బిజినెస్.. వరల్డ్ వైడ్ థియేట్రికల్ బిజినెస్ ఎంతంటే!
దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ కారణంగా థియేటర్లు మూసివేతకు గురి కావడంతో భారీ సినిమాల రిలీజ్ ఉన్నట్టుంది ఆగిపోయింది. దాదాపు 10 నెలల విరామం తర్వాత బాక్సాఫీస్‌పై దాడిని చేసేందుకు పలువురు స్టార్ హీరోలు ఇప్పుడు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో మాస్టర్ మూవీ రిలీజ్‌పై ఉత్కంఠ నెలకొన్నది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ దక్షిణాదిలో టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీస్‌గా మారింది. ఆ వివరాల్లోకి వెళితే..

100 శాతం అక్యుపెన్సీతో
లాక్‌డౌన్ తర్వాత ఇళయ దళపతి విజయ్ నటించిన మాస్టర్ సినిమా ఓ భారీ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. విజయ్ క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని తమిళనాడు ప్రభుత్వం 100 శాతం అక్యుపెన్సీకి అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో విజయ్ మూవీకి మరింత క్రేజ్ ఏర్పడింది.

తమిళ, కన్నడ, కేరళ రైట్స్
అయితే విజయ్ చిత్రానికి సంబంధించిన తమిళనాడు థియేట్రికల్ రైట్స్ 65 కోట్ల రూపాయలకు అమ్మినట్టు సమాచారం. అలాగే కర్ణాటక థియేట్రికల్ రైట్స్ 6 కోట్లు, కేరళల రైట్స్ 4.25 కోట్లు అమ్మినట్టు తెలిసింది. లాక్‌డౌన్ పరిస్థితుల్లోనే విజయ్ సినిమాకు ఈ రేంజ్ బిజినెస్ కావడం చర్చనీయాంశమైంది.

తెలుగు రాష్ట్రాల్లో
ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా మాస్టర్ బిజినెస్ భారీగానే జరిగింది. ఏపీ థియేట్రికల్ విషయానికి వస్తే.. 6.5 కోట్లకు, నైజాంలో రూ.3 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తున్నది. సూపర్ స్టార్ విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో మంచి మార్కెట్ ఉన్న విషయం తెలిసిందే.

ఓవర్సీస్ బిజినెస్
ఇక మిగితా రాష్ట్రాల్లో విషయానికి వస్తే.. దాదాపు రూ.6 కోట్లకు థియేట్రికల్ రైట్స్ అమ్ముడైనట్టు సమాచారం. ఇక ఓవర్సీస్ రైట్స్ 15 కోట్లకు అమ్ముడుపోయినట్టు సమాచారం. ఓవరాల్‌గా రూ.105.75 కోట్లకు వరల్డ్ వైడ్ బిజినెస్ జరిగినట్టు తెలుస్తున్నది. ఇలా స్వదేశీ, విదేశీ బాక్సాఫీస్‌ను కుదిపేసేలా మాస్టర్ కలెక్షన్లు సాధిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది.

నటీనటులు, సాంకేతిక వర్గం
విజయ్, విజయ్ సేతుపతి, మాళవిక మోహనన్, అర్జున్ దాస్, ఆండ్రియా జెర్మియా, శంతను భాగ్యరాజ్, నాజర్, సిమ్రాన్ తదితరులు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: లోకేష్ కనకరాజ్
నిర్మాత: జేవియర్ బిట్టో
మ్యూజిక్: అనిరుధ్ రవిచంద్రన్
సినిమాటోగ్రఫి: సత్యన్ సూర్యన్
ఎడిటింగ్: ఫిలోమిన్ రాజ్
రిలీజ్ డేట్: 2020-01-13


Click it and Unblock the Notifications











