రికార్డులను తిరగేస్తూ.. దుమ్మురేపుతున్న సర్కార్.. వివాదాస్పద కేక్‌తో మళ్లీ కెలికి..!

తమిళ సూపర్‌స్టార్ విజయ్, సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్‌లో వచ్చిన సర్కార్ చిత్రం బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తున్నది. ఎన్ని వివాదాలు ఎదురైనా వాటిని అధిగమించుకొంటూ దూసుకెళ్తున్నది. ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.200 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. సర్కార్ విజయాన్ని పురస్కరించుకొని చిత్ర యూనిట్ సక్సెస్‌ పార్టీని జరుపుకొన్నది. వివరాల్లోకి వెళితే..

విజయ్ మరో అరుదైన ఘనత

విజయ్ మరో అరుదైన ఘనత

తమిళ చిత్ర పరిశ్రమలో విజయ్ అరుదైన ఘనతను సాధించాడు. సర్కార్ చిత్రం రూ.200 కోట్ల క్లబ్‌లో చేరడంతో కోలీవుడ్‌లో అత్యంత సక్సెస్‌ఫు‌ల్ హీరోగా ఓ ట్యాగ్‌ను సొంతం చేసుకొన్నాడు. గతంలో విజయ్ నటించిన మెర్సల్ చిత్రం కూడా రూ.200 కోట్లకుపైగా వసూలు చేసిన సంగతి తెలిసిందే.

చెన్నైలో భారీ వసూళ్లు

చెన్నైలో భారీ వసూళ్లు

సర్కార్ చిత్రం చెన్నై నగరంలో కూడా భారీ వసూళ్లు సాధించింది. ఆదివారం ఈ చిత్రం రూ.1.76 కోట్లు సాధించింది. గత ఆరు రోజుల్లో ఈ చిత్రం రూ.10.77 కోట్లు సాధించి విజయ్ తన కెరీర్‌లో సరికొత్త రికార్డును సొంతం చేసుకొన్నాడు.

ఓవర్సీస్‌లో కలెక్షన్ల జోష్

ఓవర్సీస్‌లో కలెక్షన్ల జోష్

ఓవర్సీస్ మార్కెట్‌లో సర్కార్ చిత్రం మంచి కలెక్షన్లను సాధిస్తున్నది. విజయ్ కెరీర్‌లోనే భారీ వసూళ్లు సాధించిన మూడో చిత్రంగా ఓ రికార్డును నమోదు చేసుకొన్నది. ఈ చిత్రం అమెరికాలో మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరింది.

యూఎస్‌ బాక్సాఫీస్ వద్ద

యూఎస్‌ బాక్సాఫీస్ వద్ద

ఓవర్సీస్ మార్కెట్‌లో తమిళ చిత్ర రికార్డులు ఇలా ఉన్నాయి. అమెరికాలో అత్యధికంగా కబాలి చిత్రం 4,585,808 డాలర్లు, రోబో (ఎంథిరన్) 2,021,465, కాలా చిత్రం 1,913,110 డాలర్లు, మెర్సల్ 1,830,866 డాలర్లు, తెరీ మూవీ 1,128,975 డాలర్లు సాధించాయి. ప్రస్తుతం ఈ చిత్రం మిలియన్ డాలర్ల మార్క్‌ను చేరింది.

సక్సెస్ పార్టీ జోష్

సక్సెస్ పార్టీ జోష్

బాక్సీఫీస్ వద్ద వసూళ్ల సునామీని సృష్టిస్తున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ సక్సెస్ పార్టీ చేసుకొన్నది. ఈ పార్టీకి దర్శకుడు ఏఆర్ మురుగదాస్, హీరో విజయ్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మన్, కీర్తి సురేష్, వరలక్ష్మీ శరత్ కుమార్ తదితరులు హాజరయ్యారు.

వివాదాస్పదంగా సక్సెస్ పార్టీ కేక్

వివాదాస్పదంగా సక్సెస్ పార్టీ కేక్

తాజా సక్సెస్ పార్టీలో మిక్సీలు, గ్రైండర్లతో కూడిన కేక్‌ను సర్కార్ చిత్ర యూనిట్ కట్ చేయడం గమనార్హం. అన్నాడీఎంకే వేటినైతో అభ్యంతరం చెప్పారో వాటిని ఆధారంగా చేసుకొని కేక్ తయారు చేయడం తమిళ చిత్ర పరిశ్రమలో చర్చనీయాంశమైంది. ఎన్నారై సాఫ్ట్‌వేర్ సంస్థ యజమానిగా నటించిన విజయ్ చిత్రానికి మంచి ఆదరణ లభిస్తున్న సంగతి తెలిసిందే.

Recommended Video

Director AR Murudadoss Faces A Severe Opposition From TN Government | Filmibeat Telugu
అన్నాడీఎంకే ఫైర్

అన్నాడీఎంకే ఫైర్

విజయ్ నటించిన సర్కార్ చిత్రంపై అన్నాడీఎంకే పార్టీ నేతలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఎన్నాడీఎంకే పథకాలను కించపరిచే విధంగా, ప్రభుత్వ ప్రతిష్ఠను దిగజార్చే విధంగా రూపొందించిన ఈ చిత్రంపై ఆందోళనలు చేపట్టారు. అన్నాడీఎంకే ప్రభుత్వం ఇచ్చిన మిక్సీలు, గ్రైండర్లను మంటల్లో వేసే కొన్ని సీన్లను తొలగించి ఇటీవల ప్రదర్శించారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X