సర్కార్ కలెక్షన్ల హంగామా.. కాలా, బాహుబలి2 రికార్డులు బ్రేక్
భారీ అంచనాల మధ్య రిలీజైన సర్కార్ చిత్రం తమిళనాడులో కలెక్షన్ల హంగామాను కొనసాగిస్తున్నది. టాక్ ఎలా ఉన్నప్పటికీ.. సూపర్ స్టార్ విజయ్ స్టామినాకు ఈ వసూళ్లు అద్దంపడుతున్నాయి. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం నవంబర్ 6న రిలీజైన సంగతి తెలిసిందే. ఓటు హక్కు ప్రాధాన్యతను చాటిచెప్పే అంశంతో రాజకీయ విమర్శనాస్త్రంగా ఈ చిత్రం తెరకెక్కింది. ఈ చిత్రం వసూళ్లు చెన్నైలో రికార్డు సృష్టించింది. వివరాల్లోకి వెళితే..

మొదటి రోజు 330 షోలు
సర్కార్ చిత్రం ప్రదర్శనల సంఖ్య విషయంలో సంచలనం రేపింది. తొలి రోజు 22 థియేటర్లలో 330 షోలను ప్రదర్శించడం గమనార్హం. ప్రత్యేక షోల విషయంలో అనిశ్చితి కొనసాగడం, తమిళ్ రాకర్స్ వెబ్‌సైట్‌లో ఫుల్ మూవీ లీక్ కావడం ఆందోళన కలిగించింది. అయినా ఈ చిత్రం భారీ వసూళ్లను సాధించడం ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యానికి గురిచేసింది.

రూ.2.37 కోట్ల గ్రాస్ కలెక్షన్లు
సర్కార్ చిత్రం చెన్నైలో మొదటి రోజు రూ.2.37 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటి వరకు చెన్నైలో ఇదే అత్యుత్తమ రికార్డు. గతంలో కాలా చిత్రం రూ.1.75 కోట్ల గ్రాస్ కలెక్షన్లను, బాహుబలి2 సుమారు రూ.కోటి వసూళ్లను రాబట్టింది. ప్రస్తుతం ఆ రికార్డులను సర్కార్ చిత్రం అధిగమించింది.

గతంలో విజయ్ సినిమా
చెన్నైలో విజయ్ చిత్రం తొలిరోజున అత్యధికంగా రూ.1.48 కోట్లు వసూలు చేసినట్టు రికార్డు ఉంది. ఇక అజిత్ వివేకం రూ.1.21 కోట్లు, విజయ్ తేరి రూ.1.01 కోట్లు రాబట్టాయి. కానీ తాజాగా విడుదలైన సర్కార్ చిత్రం మాత్రం ఈ రికార్డులను తుడిచిపెట్టేయడం విశేషం.

తమిళనాడులో భారీగా
తమిళనాడు రాష్ట్రంలో సర్కార్ దాదాపు 650 థియేటర్లలో విడుదలైంది. ఇంత పెద్ద రేంజ్‌లో విజయ్ సినిమా రిలీజ్ కావడం ఇదే మొదటిసారి. దాంతో భారీగా వసూళ్లు రావడానికి కారణమైంది. రాష్ట్రమంతటా అన్ని థియేటర్లలో 85 శాతం అక్యుపెన్సీ ఉన్నట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. రానున్న రోజుల్లో వచ్చే కలెక్షన్లను బట్టే సర్కార్ సినిమా రేంజ్ ఏంటో అర్ధమవుతుంది.


Click it and Unblock the Notifications











