Varisu/Varasudu Total Collections.. విజయ్ మూవీ హిట్టా ఫట్టా? దిల్ రాజుకు లాభమా? నష్టమా?
తమిళ సూపర్ స్టార్ విజయ్, ప్రముఖ సిని నిర్మాత దిల్ రాజు, దర్శకుడు వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో వచ్చిన వారిసు (తెలుగులో వారసుడు) సంకాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో మొదట రిలీజైన ఈ చిత్రం తెలుగులో మూడు రోజుల తర్వాత అంటే జనవరి 14వ తేదీన రిలీజైంది. తమిళనాడు, ఓవర్సీస్‌లో తప్పా.. మిగితా ప్రాంతాల్లో పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. ఈ సినిమా గత 34 రోజుల తర్వాత ఎంత వసూలు చేసింది? ఎంత బిజినెస్ చేసింది? ఈ సినిమా దిల్ రాజుకు లాభమా? నష్టమా అనే వివరాల్లోకి వెళితే..

వారిసు బడ్జెట్, థియేట్రికల్ బిజినెస్
వారిసు సినిమా మొత్తం బడ్జెట్ కాస్ట్ విషయానికి వస్తే.. 225 కోట్ల రూపాయలు. ఈ సినిమా రిలీజ్‌కు ముందు ప్రీ రిలీజ్ బిజినెస్ బ్రహ్మండంగా చేసింది. తమిళనాడు హక్కులను 70 కోట్ల రూపాయలకు, తెలంగాణ, ఆంధ్రా థియేట్రికల్ హక్కులను 20 కోట్ల రూపాయలు, కర్ణాటక థియేట్రికల్ హక్కులను 8 కోట్ల రూపాయలు, కేరళ థియేట్రికల్ హక్కులను 6.5 కోట్లు, హిందీ థియేట్రికల్ హక్కులను 32 కోట్లకు అమ్మడం జరిగింది.

తొలి, రెండోవారం కలెక్షన్లు
వారిసు (వారసుడు) సినిమా ప్రతీ వారం సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తొలివారం తమిళనాడులో 107 కోట్లు, హిందీ వెర్షన్ 6 కోట్లు, తెలుగు వెర్షన్ 19 కోట్ల రూపాయలు వసూలు చేయడం ద్వారా 132 కోట్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. రెండోవారం విషయానికి వస్తే.. తమిళనాడులో 26 కోట్ల షేర్, హిందీ 2 కోట్ల షేర్, తెలుగులో 1.6 కోట్ల షేర్ వసూలు చేసింది. దాంతో రెండోవారం 30 కోట్ల మేర కలెక్షన్లు రాబట్టింది.

మూడో వారం నుంచి క్షీణిస్తూ..
వారిసు (వారసుడు) సినిమా మూడో వారం నుంచి భారీగా వసూళ్లు క్షీణించాయి. మూడోవారం అన్ని భాషల్లో వసూళ్లు కలిపి 10 కోట్లు, నాలుగోవారం 4 కోట్లు, ఐదోవారంలో 1.4 కోట్ల మేర వసూళ్లు రాబట్టింది. దాదాపు విడుదలైన అన్ని కేంద్రాల్లో బాక్సాఫీస్ జర్నీని ముగించింది.

గత 34 రోజుల వారిసు బాక్సాఫీస్ జర్నీ
కర్ణాటక, ఏపీ, నైజాం, తమిళనాడు, కేరళ, ఇతర రాష్ట్రాల్లో వారిసు (వారసుడు) సినిమా ఘనంగా రిలీజైంది. గత 34 రోజుల కలెక్షన్ల విషయానికి వస్తే.. కర్ణాటకలో 14.46 కోట్లు, ఏపీ, నైజాంలో 26 కోట్లు, తమిళనాడులో 142 కోట్ల షేర్, కేరళలో 12 కోట్ల షేర్, ఇతర రాష్ట్రాల్లో 14 కోట్ల షేర్ రాబట్టింది. దాంతో ఈ చిత్రం 208 కోట్ల షేర్ దేశీయంగా రాబట్టింది.

ప్రపంచవ్యాప్తంగా వారిసు కలెక్షన్లు
వారిసు (వారసుడు) సినిమా టోటల్ కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. దేశవ్యాప్తంగా ఈ చిత్రం 210 కోట్ల గ్రాస్, 176 కోట్ల షేర్, ఓవర్సీస్‌లో 90 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 300 కోట్ల క్లబ్‌లో చేరింది. ప్రపంచవ్యాప్తంగా థియేట్రికల్ హక్కులు 170 కోట్ల మేర బిజినెస్ జరిగితే.. సుమారు 210 కోట్ల షేర్ రాబట్టింది. దాంతో థియేట్రికల్‌గా 40 కోట్ల లాభాలను రాబట్టింది.

వారిసు సినిమా లాభమా? నష్టమా?
ఇక వారిసు (వారసుడు) సినిమా ఓవరాల్‌గా చూసుకొంటే.. అమెజాన్ ప్రైమ్ వీడియో డిజిటల్ హక్కులను 75 కోట్లకు తీసుకొంటే.. సన్ టీవీ శాటిలైట్ హక్కులను 45 కోట్లకు సొంతం చేసుకొన్నది. మ్యూజిక్ రైట్స్ రూపంలో 10 కోట్లు వచ్చాయి. దాంతో ఈ సినిమా సుమారు 310 కోట్లు ఓవరాల్ బిజినెస్ చేస్తే.. మొత్తంగా ఈ సినిమా సుమారుగా అన్నీ కలిపి సుమారు 85 కోట్ల మేర లాభాలను నిర్మాతకు పంచి పెట్టినట్టు ట్రేడ్ వర్గాల సమాచారం.


Click it and Unblock the Notifications











