సర్కార్ ఫస్ట్ డే కలెక్షన్స్.. టాక్ చూస్తే అలా, విజయ్ సత్తా ఈ రేంజ్‌లోనా!
Recommended Video

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం సర్కార్. ప్రముఖ దర్శకుడు మురుగదాస్ తెరకెక్కించిన ఈ చిత్రం నవంబర్ 6 న దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి షో నుంచే ఈ చిత్రానికి కొంత డివైడ్ టాక్ ప్రారంభమైంది. మురుగదాస్, విజయ్ కాంబోలో వచ్చిన గత చిత్రాలు కత్తి, తుపాకీ స్థాయిని ఈ చిత్రం చేరుకోలేకపోయిందని క్రిటిక్స్, ప్రేక్షకులను పెదవి విరిచారు. కానీ విజయ్ అభిమానులని అలరించే అంశాలు ఈ చిత్రంలో చాలానే ఉన్నాయట. టాక్ ఎలా ఉన్నపటికీ తొలి రోజు ఈ చిత్రం కళ్ళు చెదిరే వసూళ్ళని రాబట్టింది.

సర్కార్ మానియా
విజయ్ క్రేజ్ తమిళనాట రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ పడడంతో విజయ్ తిరుగులేని స్టార్ గా అవతరించాడు. సర్కార్ చిత్ర విడుదల సందర్భంగా గత కొన్ని రోజులుగా తమిళనాడులో అభిమానుల హంగామా కొనసాగుతోంది. ఎక్కడ చూసిన సర్కార్ మానియా కనిపిస్తోంది.

దొంగ ఓట్ల కాన్సెప్ట్
మురుగదాస్ ప్రతి చిత్రంలో ఒక విభిన్నమైన కాన్సెప్ట్ కనిపిస్తుంది. అదే విధంగా మురుగదాస్ చిత్రాల్లో మంచి సందేశం కూడా ఉంటుంది. ఈ చిత్రంలో మురుగదాస్ ఎంచుకున్న అంశం దొంగ ఓట్లు. విజయ్ శైలికి అనుగుణంగా రాజకీయ అంశాలతో దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందించారు.

రికార్డు స్థాయిలో 30 కోట్లు
సర్కార్ చిత్రం తొలిరోజు తమిళనాడు వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 30 కోట్లు రాబట్టినట్లు తెలుస్తోంది. కేవలం చెన్నై నగరంలో మాత్రం 2 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు తెలుస్తోంది. దీపావళి పండుగ సందర్భంగా సర్కార్ చిత్రం కలెక్షన్స్ పిండుకుంటున్నట్లు తెలుస్తోంది.

యూఎస్‌లో హాఫ్ మిలియన్
తమిళ చిత్రాలకు సాధారణంగా అమెరికాలో పెద్దగా మార్కెట్ లేదు. అలాంటి చోట కూడా సర్కార్ చిత్రం తొలి రోజే హాఫ్ మిలియన్ కు చేరువైనట్లు తెలుస్తోంది. కోయంబత్తూర్ ఏరియాలో ఈ చిత్రం తొలి రోజే 4 కోట్లు రాబట్టడం ఒక సంచలనం అని తమిళ సినీవర్గాలు అంటున్నారు.

నిలబడగలుగుతుందా
విజయ్ గత చిత్రం మెర్సల్ రికార్డు స్థాయిలో కలక్షన్ల ప్రభంజనం సృష్టించింది. ఆ చిత్రానికి తొలి రోజు నుంచే సూపర్ పాజిటివ్ టాక్ సొంతమైంది. కానీ సర్కార్ చిత్రానికి డివైడ్ టాక్ నడుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోవు రోజుల్లో కూడా మంచి వసూళ్లు రాబట్టడం సవాల్ తో కూడుకున్న పనే.


Click it and Unblock the Notifications











