Maharaja 12 days Collections: 100 కోట్ల క్లబ్‌లో మహరాజ.. విజయ్ సేతుపతి మూవీకి ఎన్ని కోట్ల లాభమంటే?
చైల్డ్ సెంటిమెంట్, ఫ్యామిలీ, హ్యుమన్ ఎమోషన్స్‌తో రూపొందిన మహరాజా చిత్రం బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల ప్రవాహాన్ని కొనసాగిస్తున్నది. రెండోవారంలో కూడా ఈ సినిమా వసూళ్లను ధాటిగా నమోదు చేస్తున్నది. నితిలాన్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి, దివ్య భారతి, మమతా మోహన్ దాస్ తదితరులు నటించారు. జూన్ 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ సినిమా వసూళ్ల వివరాల్లోకి వెళితే..
మహరాజా చిత్రంలో అనురాగ్ కశ్యప్ లాంటి సీనియర్ సెలబ్రిటీ తప్పితే.. మిగితా వారందరూ టాలెంటెడ్ కొత్త ఆర్టిస్టులే. కాకపోతే టెక్నికల్ టీమ్ సీనియర్లతో మేళవించారు. దాంతో ఈ సినిమా బడ్జెట్ 30 కోట్ల రూపాయలు అయింది. తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ రైట్స్ 2.5 కోట్ల రూపాయల మేర జరిగింది.

ఇక ఈ సినిమా తొలివారం కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. తమిళంలో ఈ చిత్రం 30 కోట్ల రూపాయలు, తెలుగులో 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. తొలివారంలోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్ అధిగమించి భారీ లాభాలతో కొనసాగుతున్నది. రెండో వారంలో గత నాలుగు రోజుల్లో ఈ చిత్రం మరో ఈ చిత్రం 15 కోట్ల రూపాయలు, తెలుగులో 3.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో తమిళంలో 45 కోట్ల రూపాయలు, తెలుగులో 12 కోట్ల రూపాయలు వసూలు చేసింది.
ఇక కర్ణాటకలో ఈ చిత్రం భారీ కలెక్షన్లు నమోదు చేసింది. గత 11 రోజుల్లో ఈ చిత్రం కన్నడలో 6 కోట్ల రూపాయలు, కేరళలో 5 కోట్ల రూపాయలు, ఓవర్సీస్‌లో 20.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దాంతో ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా సుమారుగా 90 కోట్ల రూపాయలు కొల్లగొట్టింది. త్వరలోనే ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు రెడీ అవుతున్నది.

ఇక రిలీజ్ డేట్ నుంచి 12వ రోజున కూడా విజయ్ సేతుపతి నటించిన మహరాజా చిత్రం నిలకడగా కనిపిస్తున్నది. ఈ చిత్రం తెలుగు, తమిళంలో 2 నుంచి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేయవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఇక ప్రపంచవ్యాప్తంగా మరో 3 నుంచి 3.5 కోట్ల వసూలు చేసే ఛాన్స్ ఉందని పేర్కొన్నారు. దాంతో ఈ సినిమా 92 నుంచి 93.5 కోట్ల వసూళ్లు నమోదు చేసే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











