30 కోట్ల బడ్జెట్.. మహరాజ మూవీ ఎన్ని కోట్లు కలెక్ట్ చేసిందంటే? విజయ్ సేతుపతి కెరీర్‌లో హయ్యెస్ట్‌గా!
మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి నటించిన మహరాజ చిత్రం మూడో వారంలో కూడా గట్టిగానే వసూళ్లను రాబడుతున్నది. ఓ వైపు దేశవ్యాప్తంగా కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్‌ను కుదిపేస్తుంటే.. ఈ సినిమా నిలకడగా వసూళ్లను రాబడుతున్నది. నితిలాన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ చిత్రం గత 18 రోజుల్లో సాధించిన కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..
విజయ్ సేతుపతి నటించి ఈ ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా, డాటర్ సెంటిమెంట్ చిత్రం మీడియం రేంజ్ బడ్జెట్‌తో రూపొందించారు. దివ్య భారతీ, మమతా మోహన్ దాస్ లాంటి హీరోయిన్లు ప్రధాన పాత్రలో కనిపించగా.. బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో మెప్పించాడు. ఈ సినిమాను అన్ని ఖర్చులు కలుపుకొని మొత్తంగా 30 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

మహరాజ చిత్రం ఇండియాలో మంచి రెస్పాన్స్ కూడగట్టుకొన్నది. తొలివారం ఈ సినిమా 39 కోట్ల రూపాయలు రాబట్టింది. తమిళంలో 30 కోట్లు, తెలుగులో 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక రెండో వారంలో 24 కోట్ల రూపాయలు రాబట్టింది. దాంతో ఈ సినిమా రెండువారాల్లో 63 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక మూడో వారంలో ఈ చిత్రం మరో 4 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. దాంతో ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లోనే 67 కోట్లు వసూలు చేసింది.
ఇక ఇతర భాషల విషయానికి వస్తే.. కర్ణాటకలో ఈ సినిమా 8.5 కోట్ల రూపాయలు, కేరళలో 6 కోట్ల రూపాయలు, వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం 15 కోట్ల మేర వసూళ్లను సాధించింది. దాంతో ఈ చిత్రం 91 కోట్లకు పైగా కలెక్షన్లు నమోదు చేసింది.
ఇక ఓవర్సీస్‌లో మహరాజకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఈ మూవీ సుమారుగా 25 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసింది. దాంతో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 116 కోట్ల రూపాయలను బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టింది. ఈ చిత్రం టోటల్ రన్‌లో 120 కోట్ల రూపాయల వద్ద ముగుస్తుందని ట్రేడ్ అనలిస్టులు తెలిపారు.


Click it and Unblock the Notifications











