Maharaja 12 Days Collections: మహారాజ రికార్డు వసూళ్లు.. లాభమే అన్ని కోట్లు.. తెలుగులో ఎన్ని కోట్లంటే!

సౌత్ ఇండియా హీరోలకు భారీ స్థాయిలో డిమాండ్ ఉంది. ముఖ్యంగా కొందరు విలక్షణ నటులు పాన్ ఇండియా రేంజ్‌లో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిలో కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి ఒకరు. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్న ఆయన.. మరోవైపు హీరోగానూ సత్తా చాటుతున్నాడు.

ఈ క్రమంలోనే ఇప్పుడు 'మహారాజ' అనే మూవీతో వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. అందుకు తగ్గట్లే వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'మహారాజ' సినిమా 12 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూడండి!

Vijay Sethupathi Starrer Maharaja Movie 12 Days Box Office Collections

మహారాజగా కోలీవుడ్ స్టార్
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి నటించిన క్రైమ్ సినిమానే 'మహారాజ'. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జగదీష్ పలణిస్వామి, సుదన్ సుందరమ్ నిర్మించారు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్‌ను అందించారు. ఇందులో అభిరామి, మమతా మోహన్‌దాస్, భారతిరాజా, దివ్య భారతి, మునిష్‌కాంత్ కీలక పాత్రల్లో నటించారు.

Vijay Sethupathi Starrer Maharaja Movie 12 Days Box Office Collections

మహారాజ మూవీ బిజినెస్

క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో రూపొందిన 'మహారాజ' మూవీ ఆరంభంలోనే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల అందరి దృష్టి పడింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా రైట్స్‌కు అదిరిపోయే డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.00 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ. 20 కోట్లు మేర బిజినెస్ అయింది.

12వ రోజు తెలుగు వసూళ్లు
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజ' మూవీ ఎన్నో అంచనాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే లభిస్తోంది. అయితే, 12వ రోజు ఈ చిత్రం కాస్త డౌన్ అయింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా రూ. 27 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

Vijay Sethupathi Starrer Maharaja Movie 12 Days Box Office Collections

12 రోజులకూ కలిపి ఎంత?

ఫాదర్ అండ్ డాటర్ సెంటిమెంట్‌తో 'మహారాజ' మూవీకి తెలుగులో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీ స్థాయిలోనే వసూలు అవుతున్నాయి. ఇలా నైజాం ఏరియాలో రూ. 2.98 కోట్లు, సీడెడ్‌లో రూ. 92 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ మొత్తంలో రూ. 2.14 కోట్లతో కలిపి రూ. 6.04 కోట్లు షేర్, రూ. 12.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే
విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ' మూవీకి 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 12.25 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, తమిళనాడులో రూ. 41.60 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 11.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 23.40 కోట్లు వచ్చాయి. ఇలా ఈ చిత్రం ఇప్పటి వరకూ రూ. 89.05 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 43.15 కోట్లు షేర్‌ను వసూలు చేసుకుని సత్తా చాటుకుంది.

Vijay Sethupathi Starrer Maharaja Movie 12 Days Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభాలతో

'మహారాజ' మూవీ అంచనాలకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.00 కోట్లు బిజినెస్ చేసింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 3.50 కోట్లుగా నమోదు చేసుకుంది. ఇక, ఈ సినిమా 12 రోజుల్లో రూ. 6.04 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో రూ. 2.54 కోట్లు లాభాలను అందుకుంది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 22.15 కోట్లు లాభాలతో సరికొత్త రికార్డును సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X