Maharaja 2 Days Collections: కుమ్మేసిన మహారాజా.. 2వ రోజు డబుల్.. విజయ్ సేతుపతి ఎన్ని కోట్లు కొట్టాడంటే!

పేరుకు తమిళ హీరోనే అయినా దేశ వ్యాప్తంగా క్రేజ్‌ను, మార్కెట్‌ను సొంతం చేసుకుని సత్తా చాటుతున్నాడు విలక్షణ నటుడు విజయ్ సేతుపతి. ఒకవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాలు చేస్తోన్న అతడు.. హీరోగానూ వరుస చిత్రాలతో వస్తున్నాడు.

ఇలా ఇప్పుడు ఈ టాలెంటెడ్ స్టార్ నటించిన సినిమానే 'మహారాజా'. ఫుల్ లెంగ్త్ మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాకు తెలుగులో సూపర్ రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా రెండో రోజు ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో 'మహారాజా' మూవీ 2 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూసేయండి!

Vijay Sethupathi Starrer Maharaja Movie 2 Days Box Office Collections

మహారాజాగా వచ్చిన స్టార్
విలక్షణ నటుడు విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజా చిత్రమే 'మహారాజా'. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జగదీష్ పలణిస్వామి, సుదన్ సుందరమ్ నిర్మించారు. ఇందులో అభిరామి, మమతా మోహన్‌దాస్, భారతిరాజా, దివ్య భారతి, మునిష్‌కాంత్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని అందించారు.

Vijay Sethupathi Starrer Maharaja Movie 2 Days Box Office Collections

మహారాజా మూవీ బిజినెస్ ఇలా

వైవిధ్యమైన కథాంశంతో క్రైమ్ థ్రిల్లర్‌గా రూపొందిన 'మహారాజా' మూవీ ఆరంభంలోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.00 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఇది ఇక్కడ ఎంతో గ్రాండ్‌గా విడుదల అయింది.

2వ రోజు తెలుగు వసూళ్లు
క్రేజీ కాన్సెప్టుతో రూపొందిన 'మహారాజా' మూవీ ఎన్నో అంచనాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే లభిస్తోంది. ముఖ్యంగా రెండో రోజు ఈ చిత్రం ఫస్ట్ డే కంటే డబుల్ వసూళ్లు సాధించింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 2వ రోజు రూ. 1.10 కోట్లు షేర్‌ను వసూలు చేసింది.

Vijay Sethupathi Starrer Maharaja Movie 2 Days Box Office Collections

2 రోజులకూ కలిపి ఎంత?

విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజా' మూవీకి తెలుగులో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీ స్థాయిలోనే లభిస్తున్నాయి. ఇలా రెండు రోజుల్లో 'మహారాజా' మూవీ నైజాం ఏరియాలో రూ. 85 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ మొత్తంలో రూ. 85 లక్షలతో కలిపి రూ. 1.70 కోట్లు షేర్, రూ. 3.40 కోట్లు గ్రాస్ రాబట్టింది.

టార్గెట్ ఇలా.. ఎంత రావాలి?
విజయ్ సేతుపతి హీరోగా నిథిలన్ తెరకెక్కించిన 'మహారాజా' మూవీ అంచనాలకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.00 కోట్లు బిజినెస్ చేసింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 3.50 కోట్లుగా నమోదు చేసుకుంది. ఇక, ఈ సినిమా 2 రోజుల్లో రూ. 1.70 కోట్లు రాబట్టింది. అంటే విజయ్ సేతుపతి సినిమా తెలుగులో హిట్ అవ్వాలంటే రూ. 1.80 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X