Maharaja Box Office: విజయ్ సేతుపతి వీర కుమ్ముడు.. తెలుగులో మహారాజకు ఎన్ని కోట్ల కలెక్షన్లంటే?
వేరే భాషలకు చెందిన హీరోల్లో కొందరు మాత్రమే తెలుగులో మంచి మార్కెట్‌ను, ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో విజయ్ సేతుపతి ఒకరు. ఇప్పటికే చాలా చిత్రాలతో మన ప్రేక్షకులను పలకరించిన ఆయన.. ఇప్పుడు తన 50వ మూవీగా 'మహారాజా'ను చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో వచ్చింది. అందుకు తగ్గట్లుగానే తెలుగులో వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'మహారాజా' మూవీ 4 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూసేయండి మరి!

థ్రిల్ చేసేలా మహారాజా
సెన్సేషనల్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన తాజా సినిమానే 'మహారాజా'. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను జగదీష్ పలణిస్వామి, సుదన్ సుందరమ్ నిర్మించారు. ఇందులో అభిరామి, మమతా మోహన్‌దాస్, భారతిరాజా, దివ్య భారతి, మునిష్‌కాంత్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ సంగీతాన్ని సమకూర్చాడు.

మహారాజా మూవీ బిజినెస్
ఉత్కంఠను రేపే కథతో రూపొందిన 'మహారాజా' మూవీ ఆరంభంలోనే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల అందరి దృష్టి పడింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.00 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అందుకు అనుగుణంగానే ఇక్కడ ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేశారు.

4వ రోజు తెలుగు వసూళ్లు
థ్రిల్ చేసే కాన్సెప్టుతో రూపొందిన 'మహారాజా' మూవీ ఎన్నో అంచనాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. అందుకు అనుగుణంగానే దీనికి భారీ రెస్పాన్స్ లభిస్తోంది. అయితే, నాలుగో రోజు రెస్పాన్స్ కాసింత తగ్గిపోయింది. ఫలితంగా సోమవారం రూ. 75 లక్షలు వరకూ రాబట్టింది. ఇలా ఈ చిత్రం 4 రోజుల్లోనే రూ. 3.70 కోట్లు రాబట్టింది.


Click it and Unblock the Notifications











