Maharaja 8 Days Collections: విజయ్ సేతుపతి మాస్ కొట్టుడు.. కోట్ల లాభాలతో పెను సంచలనం
సౌత్ ఇండియాకు చెందిన కొందరు హీరోలకు మాత్రమే దేశ వ్యాప్తంగా గుర్తింపు, ఫాలోయింగ్ సొంతం అయింది. అందులో కొందరు మాత్రమే పాన్ ఇండియా స్టార్లుగా మారారు. అలాంటి వారిలో విజయ్ సేతుపతి ఒకడు. కొంత కాలంగా భారీ చిత్రాలతో వస్తూ సత్తా చాటుతోన్న అతడు.. తాజాగా 'మహారాజ'ను చేశారు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. అందుకు తగ్గట్లే వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో 'మహారాజ' సినిమా 8 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూసేయండి మరి!
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లోనూ
పాన్ ఇండియా స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే 'మహారాజ'. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జగదీష్ పలణిస్వామి, సుదన్ సుందరమ్ నిర్మించారు. ఇందులో అభిరామి, మమతా మోహన్‌దాస్, భారతిరాజా, దివ్య భారతి, మునిష్‌కాంత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్‌ను కంపోజ్ చేశారు.

మహారాజ మూవీ బిజినెస్
క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో తెరకెక్కిన 'మహారాజ' మూవీ ఆరంభంలోనే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల అందరి దృష్టి పడింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.00 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ. 20 కోట్లు మేర బిజినెస్ అయింది.

8వ రోజు ఇలా.. మొత్తంగా
అన్ని వర్గాల వాళ్లనూ ఆకట్టుకునే కథాంశంతో రూపొందిన 'మహారాజ' సినిమాకు 8వ రోజు కూడా మంచి స్పందన లభించింది. ఫలితంగా ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో రూ. 20 లక్షలు షేర్‌ను వసూలు చేసింది. అలాగే, ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలూ కలిపి రూ. 1 కోటి కంటే ఎక్కువ షేర్ రాబట్టింది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం రూ. 27 కోట్లు వసూళ్లు సాధించి సత్తా చాటింది.


Click it and Unblock the Notifications











