Maharaja 9 Days Collections: మహారాజ కలెక్షన్ల ఊచకోత.. లాభమే అన్ని కోట్లా.. తెలుగులో ఊహించని రికార్డు

విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ తనకంటూ స్పెషల్ స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్నాడు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి. దేశ వ్యాప్తంగా ఎన్నో భాషల్లో నటిస్తోన్న అతడు.. వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇలా ఇటీవలే 'మహారాజ' అనే మూవీతో వచ్చాడు. క్రైమ్ థ్రిల్లర్ జోనర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా భారీ అంచనాలతో విడుదలైంది. అందుకు తగ్గట్లే వసూళ్లను రాబడుతూ సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో 'మహారాజ' సినిమా 9 రోజుల బాక్సాఫీస్ రిపోర్టును మీరే చూసేయండి!

మహారాజగా వచ్చిన స్టార్
కోలీవుడ్ స్టార్ విజయ్ సేతుపతి హీరోగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీనే 'మహారాజ'. నిథిలన్ స్వామినాథన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని జగదీష్ పలణిస్వామి, సుదన్ సుందరమ్ నిర్మించారు. ఇందులో అభిరామి, మమతా మోహన్‌దాస్, భారతిరాజా, దివ్య భారతి, మునిష్‌కాంత్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు అంజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్‌ను అందించారు.

Vijay Sethupathi Starrer Maharaja Movie 9 Days Box Office Collections

మహారాజ మూవీ బిజినెస్
ఫాదర్, డాటర్ సెంటిమెంట్‌తో తెరకెక్కిన 'మహారాజ' మూవీ ఆరంభంలోనే తమిళంతో పాటు తెలుగు ప్రేక్షకుల అందరి దృష్టి పడింది. అందుకు అనుగుణంగానే ఈ సినిమా రైట్స్‌కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఫలితంగా ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.00 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. అలాగే, వరల్డ్ వైడ్‌గా ఈ సినిమాకు రూ. 20 కోట్లు మేర బిజినెస్ జరిగింది.

9వ రోజు తెలుగు వసూళ్లు
విజయ్ సేతుపతి హీరోగా నటించిన 'మహారాజ' మూవీ ఎన్నో అంచనాలతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో చాలా గ్రాండ్‌గా రిలీజ్ అయింది. కానీ, దీనికి ఆరంభంలోనే పాజిటివ్ టాక్ రావడంతో రెస్పాన్స్ భారీగానే లభిస్తోంది. ముఖ్యంగా 9వ రోజు ఈ చిత్రం మంచి వసూళ్లు సాధించింది. ఇలా రెండు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమా 9వ రోజు రూ. 45 లక్షలు షేర్‌ను వసూలు చేసింది.

Vijay Sethupathi Starrer Maharaja Movie 9 Days Box Office Collections

9 రోజులకూ కలిపి ఎంత?
థ్రిల్, సెంటిమెంట్‌ అంశాలతో రూపొందిన 'మహారాజ' మూవీకి తెలుగులో అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఫలితంగా ఈ సినిమాకు కలెక్షన్లు కూడా భారీ స్థాయిలోనే లభిస్తున్నాయి. ఇలా నైజాం ఏరియాలో రూ. 2.12 కోట్లు, సీడెడ్‌లో రూ. 80 లక్షలు, ఆంధ్రప్రదేశ్‌ మొత్తంలో రూ. 1.83 కోట్లతో కలిపి రూ. 4.75 కోట్లు షేర్, రూ. 9.55 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

వరల్డ్ వైడ్‌గా ఎంతంటే
విజయ్ సేతుపతి నటించిన 'మహారాజ' మూవీకి 9 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో రూ. 9.55 కోట్లు గ్రాస్ వచ్చింది. అలాగే, తమిళనాడులో రూ. 35.40 కోట్లు, కర్నాటక ప్లస్ రెస్టాఫ్ ఇండియాలో రూ. 9.15 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 19.60 కోట్లు వచ్చాయి. ఇలా ఈ చిత్రం ఇప్పటి వరకూ రూ. 73.70 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 35.70 కోట్లు షేర్‌ను వసూలు చేసుకుని సత్తా చాటుకుంది.

Vijay Sethupathi Starrer Maharaja Movie 9 Days Box Office Collections

టార్గెట్ ఇలా.. లాభాలతో
'మహారాజ' మూవీ అంచనాలకు అనుగుణంగానే తెలుగు రాష్ట్రాల్లో రూ. 3.00 కోట్లు బిజినెస్ చేసింది. తద్వారా బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను రూ. 3.50 కోట్లుగా నమోదు చేసుకుంది. ఇక, ఈ సినిమా 9 రోజుల్లో రూ. 4.75 కోట్లు రాబట్టింది. తద్వారా హిట్ స్టేటస్‌తో రూ. 1.25 కోట్లు లాభాలను అందుకుంది. అలాగే, వరల్డ్ వైడ్‌గా రూ. 14.70 కోట్లు లాభాలతో సరికొత్త రికార్డును సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X