LEO 10 Days Collections: లియో పెను సంచలనం.. అన్ని వందల కోట్లతో ఊచకోత.. తెలుగులో లాభం ఎంతంటే!
తమిళ చిత్ర పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా స్టార్‌గా వెలుగొందుతూ.. సినిమా సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోన్న హీరోనే ఇళయదళపతి విజయ్. 'మాస్టర్' తర్వాత ఆ రేంజ్ హిట్ కోసం చూస్తున్న అతడు.. ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో 'లియో' అనే సినిమాను చేశాడు.
ఈ మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా ప్రేక్షకుల నుంచి స్పందన లభిస్తూనే ఉంది. రెండో వారంలో కాస్త డౌన్ అయినా లాభాలను మాత్రం అందుకుంటూనే ఉంది. ఈ నేపథ్యంలో 'లియో' మూవీకి 10 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి!

లియోగా ఎంటరైన విజయ్: ఇళయదళపతి విజయ్ హీరోగా సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ రూపొందించిన ఫుల్ లెంగ్త్ యాక్షన్ సినిమానే 'లియో'. యాక్షన్ జోనర్‌లో వచ్చిన ఈ చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రలో కనిపించారు.

లియో బిజినెస్ వివరాలివే: ఇళయదళపతి విజయ్ మార్కెట్‌తో పాటు 'లియో' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రికార్డు స్థాయిలో రూ. 215 కోట్లు బిజినెస్ జరిపి గ్రాండ్‌గా రిలీజ్ అయింది.

10వ రోజు తెలుగు కలెక్షన్లు: విజయ్ 'లియో' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 22 లక్షలు, సీడెడ్‌లో రూ. 9 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 8 లక్షలు, ఈస్ట్‌లో రూ. 5 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 58 లక్షలు షేర్, రూ. 1.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

10 రోజులకూ కలిపి ఎంత?: 10 రోజుల్లో 'లియో' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.29 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.42 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.90 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.88 కోట్లు, వెస్ట్‌లో రూ. 98 లక్షలు, గుంటూరులో రూ. 1.76 కోట్లు, కృష్ణాలో రూ. 1.55 కోట్లు, నెల్లూరులో రూ. 1.10 కోట్లతో కలిపి రూ. 23.88 కోట్లు షేర్, రూ. 43.15 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: 'లియో' మూవీ సినిమాకు 10 రోజుల్లో తమిళనాడులో రూ. 172.05 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 43.15 కోట్లు, కర్నాటకలో రూ. 34.40 కోట్లు, కేరళలో రూ. 51.25 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 27.60 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 172.40 కోట్లు వచ్చాయి. ఇలా ఇప్పటికి ఈ మూవీ రూ. 500.85 కోట్లు గ్రాస్, రూ. 251.55 కోట్లు షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: విజయ్ నటించిన 'లియో' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 215 కోట్లు బిజినెస్ చేయగా.. 10 రోజుల్లో రూ. 251.55 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 35.55 కోట్లు లాభాలను అందుకుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 16 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 17 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీ రూ. 6.88 కోట్లు లాభాలు సాధించింది.


Click it and Unblock the Notifications











