LEO 11 Days Collections: లియో సెన్సేషనల్ రికార్డు.. 11 రోజుల్లోనే అన్ని కోట్లా.. నాగవంశీకి జాక్‌పాట్

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తమిళ చిత్ర పరిశ్రమలో హవాను చూపిస్తూ.. కొంత కాలంగా దేశ వ్యాప్తంగా తన రేంజ్‌ను పెంచుకుంటూ దూసుకెళ్తోన్న హీరో ఇళయదళపతి విజయ్. ఈ మధ్య కాలంలో పక్కా కమర్షియల్ చిత్రాలతో వస్తోన్న అతడు.. ఇటీవలే 'లియో' అనే సినిమాను చేశాడు.

ఈ మూవీకి టాక్‌తో సంబంధం లేకుండా ఆడియెన్స్ నుంచి భారీ స్థాయిలో రెస్పాన్స్ లభిస్తోంది. రెండో వారంలో కాస్త డౌన్ అయినా లాభాలను పెంచుకుంటూ వెళ్తోంది. ఈ నేపథ్యంలో 'లియో' మూవీకి 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దామా!

Vijay Starrer LEO Movie 11 Days Worldwide Collections

లియోగా విజయ్ అరాచకం: ఇళయదళపతి విజయ్ హీరోగా రూపొందిన తాజా చిత్రమే 'లియో'. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రలను పోషించారు.

Vijay Starrer LEO Movie 11 Days Worldwide Collections

లియో బిజినెస్ వివరాలివే: క్రేజీ కాంబినేషన్‌లో రూపొందిన 'లియో' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రికార్డు స్థాయిలో రూ. 215 కోట్లు బిజినెస్‌ జరిపి గ్రాండ్‌గా విడుదలైంది.

Vijay Starrer LEO Movie 11 Days Worldwide Collections

11వ రోజు తెలుగు కలెక్షన్లు: విజయ్ నటించిన 'లియో' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 11వ రోజు రెస్పాన్స్ పెరిగింది. ఫలితంగా నైజాంలో రూ. 40 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 9 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 3 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 3 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 79 లక్షలు షేర్, రూ. 1.45 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Vijay Starrer LEO Movie 11 Days Worldwide Collections

11 రోజులకూ కలిపి ఎంత?: 'లియో' చిత్రానికి 11 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.69 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.54 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.99 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.92 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.01 కోట్లు, గుంటూరులో రూ. 1.81 కోట్లు, కృష్ణాలో రూ. 1.58 కోట్లు, నెల్లూరులో రూ. 1.13 కోట్లతో కలిపి రూ. 24.67 కోట్లు షేర్, రూ. 44.60 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

Vijay Starrer LEO Movie 11 Days Worldwide Collections

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: 11 రోజుల్లో విజయ్ 'లియో' సినిమాకు తమిళనాడులో రూ. 185.85 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 44.60 కోట్లు, కర్నాటకలో రూ. 36.60 కోట్లు, కేరళలో రూ. 54.20 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 30.80 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 178.65 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా ఇప్పటికి ఈ మూవీ రూ. 530.70 కోట్లు గ్రాస్, రూ. 266.65 కోట్లు షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది.

Vijay Starrer LEO Movie 11 Days Worldwide Collections

టార్గెట్ ఇలా.. లాభం అలా: విజయ్ నటించిన 'లియో' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 215 కోట్లు బిజినెస్ చేయగా.. 11 రోజుల్లో రూ. 266.65 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 50.65 కోట్లు లాభాలను అందుకుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 16 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 17 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీ రూ. 7.67 కోట్లు లాభాలు సాధించింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X