LEO 12 Days Collections: పడిపోయిన లియో వసూళ్లు.. అయినా అన్ని కోట్లు.. లాభం అన్ని కోట్లంటే నమ్ముతారా!
సౌతిండియా నుంచి వచ్చిన ఎంతో మంది హీరోలు దేశ వ్యాప్తంగా సెన్సేషన్‌గా మారిపోయారు. అలాంటి వారిలో ప్రముఖ కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్ ఒకడు. దాదాపు మూడు దశాబ్దాలుగా తమిళంలోసత్తా చాటుతోన్న అతడు.. ఈ మధ్య కాలంలో తన రేంజ్‌ను పెంచుకునే సినిమాలు చేస్తున్నాడు.
ఈ క్రమంలోనే ఇటీవలే 'లియో' అనే చిత్రంతో వచ్చాడు. దీనికి ఆరంభం నుంచే అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. కానీ, ఇప్పుడు ఒక్కసారిగా వసూళ్లు పడిపోయాయి. ఈ నేపథ్యంలో 'లియో' మూవీకి 12 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు మీరే చూడండి!

లియోగా విజయ్ ఊచకోత: కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా రూపొందిన తాజా సినిమానే 'లియో'. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రల్లో కనిపించారు.

లియో బిజినెస్ వివరాలివే: సక్సెస్‌ఫుల్ కాంబోలో రూపొందిన 'లియో' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రికార్డు స్థాయిలో రూ. 215 కోట్లు బిజినెస్ జరుపుకుని సత్తా చాటుకుంది.

12వ రోజు తెలుగు కలెక్షన్లు: విజయ్ నటించిన 'లియో' చిత్రానికి 12వ రోజు తెలుగు రాష్ట్రాల్లో రెస్పాన్స్ పడిపోయింది. ఫలితంగా నైజాంలో రూ. 9 లక్షలు, సీడెడ్‌లో రూ. 4 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 3 లక్షలు, ఈస్ట్‌లో రూ. 2 లక్షలు, వెస్ట్‌లో రూ. 2 లక్షలు, గుంటూరులో రూ. 2 లక్షలు, కృష్ణాలో రూ. 2 లక్షలు, నెల్లూరులో రూ. 1 లక్షలతో కలిపి రూ. 25 లక్షలు షేర్, రూ. 50 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

12 రోజులకూ కలిపి ఎంత?: 'లియో' చిత్రానికి 12 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.78 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.58 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 3.03 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.94 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.03 కోట్లు, గుంటూరులో రూ. 1.83 కోట్లు, కృష్ణాలో రూ. 1.60 కోట్లు, నెల్లూరులో రూ. 1.14 కోట్లతో కలిపి రూ. 24.93 కోట్లు షేర్, రూ. 45.10 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: విజయ్ 'లియో' సినిమాకు 12 రోజుల్లో తమిళనాడులో రూ. 189.80 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 45.10 కోట్లు, కర్నాటకలో రూ. 37.05 కోట్లు, కేరళలో రూ. 54.90 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 31.70 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 180.45 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా ఇప్పటికి ఈ మూవీ రూ. 539.00 కోట్లు గ్రాస్, రూ. 270.85 కోట్లు షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: విజయ్ నటించిన 'లియో' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 215 కోట్లు బిజినెస్ చేయగా.. 12 రోజుల్లో రూ. 270.85 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 54.85 కోట్లు లాభాలను అందుకుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 16 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 17 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీ రూ. 7.93 కోట్లు లాభాలు సాధించింది.


Click it and Unblock the Notifications











