LEO 2 Weeks Collections: 215 కోట్ల సినిమా.. 2 వారాల్లో సంచలన వసూళ్లు.. లాభంతోనే మరో సినిమా తీయొచ్చు!
దక్షిణాదిలోని కొంత మంది హీరోలు దేశ వ్యాప్తంగా.. కాదు కాదు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ను ఏర్పరచుకున్నారు. అందులో ఇళయదళపతి విజయ్ ఒకడు. సుదీర్ఘ కాలంగా కోలీవుడ్‌లో కమర్షియల్ సినిమాలు చేస్తూ అలరిస్తోన్న అతడు.. తన రేంజ్‌ను అంతకంతకూ పెంచుకుంటూ వెళ్తున్నాడు.
ఈ జోష్‌లోనే ఇప్పుడు 'లియో' అనే సినిమాతో వచ్చాడు. ఈ చిత్రానికి ఆరంభం నుంచే అదిరిపోయే స్పందన లభిస్తోంది. ఇలా ఈ చిత్రం రెండు వారాల్లో సంచలన వసూళ్లు సాధించింది. ఈ నేపథ్యంలో 'లియో' మూవీకి 14 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు మీరే చూడండి!

లియోగా విజయ్ విశ్వరూపం: తమిళ స్టార్ విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'లియో'. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అనిరుధ్ సంగీతాన్ని అందించాడు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది.

లియో బిజినెస్ వివరాలివే: 'మాస్టర్' తర్వాత విజయ్ - లోకేష్ కాంబోలో వచ్చిన 'లియో' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రికార్డు స్థాయిలో రూ. 215 కోట్లు బిజినెస్ జరుపుకుంది.

14వ రోజు తెలుగు కలెక్షన్లు: పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా ఇళయదళపతి విజయ్‌కు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. అందుకే 'లియో' మూవీని సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ వాళ్లు భారీ స్థాయిలో రిలీజ్ చేశారు. దీనికి ఫస్ట్ వీక్ మంచి వసూళ్లు వచ్చినా.. రెండో వారం కాస్త తగ్గాయి. ఈ క్రమంలోనే 14వ రోజు తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం రూ. 15 లక్షలు షేర్‌నే వసూలు చేసింది.

14 రోజులకూ కలిపి ఎంత?: 'లియో' చిత్రానికి 14 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 9.90 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.64 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 3.07 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.97 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.05 కోట్లు, గుంటూరులో రూ. 1.85 కోట్లు, కృష్ణాలో రూ. 1.62 కోట్లు, నెల్లూరులో రూ. 1.16 కోట్లతో కలిపి రూ. 25.26 కోట్లు షేర్, రూ. 45.75 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: 14 రోజుల్లో విజయ్ 'లియో' సినిమాకు తమిళనాడులో రూ. 194.40 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 45.75 కోట్లు, కర్నాటకలో రూ. 38.10 కోట్లు, కేరళలో రూ. 56.30 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 33.20 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 183.15 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా ఇప్పటికి ఈ మూవీ రూ. 550.90 కోట్లు గ్రాస్, రూ. 277.00 కోట్లు షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: విజయ్ నటించిన 'లియో' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 215 కోట్లు బిజినెస్ చేయగా.. 14 రోజుల్లో రూ. 277 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 61 కోట్లు లాభాలను అందుకుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 16 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 17 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీ రూ. 8.26 కోట్లు లాభాలు సొంతం చేసుకుంది.


Click it and Unblock the Notifications











