LEO Closing Collections: విజయ్ పెను సంచలనం.. అటు 600, ఇటు 300 కోట్లు ఔట్.. లాభాలు చూస్తే మెంటలే!
తమిళ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోలు చాలా మందే ఉన్నారు. కానీ, అందులో కొందరు మాత్రమే ప్రపంచ స్థాయిలో మార్కెట్‌ను ఏర్పరచుకుని సత్తా చాటుతోన్నారు. వారిలో ఇళయదళపతి విజయ్ ఒకడు. సినిమా సినిమాకూ రేంజ్ పెంచుకుంటోన్న ఈ బడా హీరో.. ఇటీవలే 'లియో' అనే చిత్రంతో వచ్చాడు.
దీనికి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, రెస్పాన్స్ మాత్రం అదిరిపోయేలా వచ్చింది. ఫలితంగా ఈ చిత్రానికి కలెక్షన్లు భారీగా దక్కాయి. ఈ నేపథ్యంలో 'లియో' మూవీకి ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్లను మీరే లుక్కేయండి!

లియోగా విజయ్ అరాచకం: కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన రీసెంట్ యాక్షన్ మూవీనే 'లియో'. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ యాక్షన్ జోనర్‌లో తెరకెక్కించిన ఈ చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రల్లో కనిపించారు. దీనికి అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు.

లియో బిజినెస్ వివరాలివే: విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'లియో' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రికార్డు స్థాయిలో రూ. 215 కోట్లు బిజినెస్ జరుపుకుంది.

అలాంటి టాక్‌తో కుమ్మేసి: కోలీవుడ్ సూపర్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ నటించిన 'లియో' మూవీకి ఆరంభంలోనే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. అయినప్పటికీ దీనికి ఊహించని విధంగా రికార్డు ఓపెనింగ్స్ దక్కాయి. ఆ తర్వాత కూడా ఈ చిత్రం హాలీడే అడ్వాంటేజ్‌ను వాడుకుని కుమ్మేసింది. దీంతో అన్ని చోట్లా భారీ వసూళ్లను రాబట్టి సత్తా చాటుకుంది. అదే సమయంలో టార్గెట్‌ను కూడా పూర్తి చేసింది.
తెలుగు రాష్ట్రాలో ఎంత?: 'లియో' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో ఫుల్ రన్‌లో కలెక్షన్లు భారీగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 10.40 కోట్లు, సీడెడ్‌లో రూ. 4.75 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 3.15 కోట్లు, ఈస్ట్‌లో రూ. 2.02 కోట్లు, వెస్ట్‌లో రూ. 1.07 కోట్లు, గుంటూరులో రూ. 1.90 కోట్లు, కృష్ణాలో రూ. 1.67 కోట్లు, నెల్లూరులో రూ. 1.19 కోట్లతో కలిపి రూ. 26.15 కోట్లు షేర్, రూ. 48 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంత?: విజయ్ నటించిన 'లియో' సినిమాకు ఫుల్ రన్‌లో తమిళనాడులో రూ. 231.50 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో రూ. 48 కోట్లు, కర్నాటకలో రూ. 41 కోట్లు, కేరళలో రూ. 60 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 41 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 199 కోట్లు వసూలు అయ్యాయి. ఇలా ముగింపు సమయానికి ఈ మూవీ రూ. 620.50 కోట్లు గ్రాస్, రూ. 305 కోట్లు షేర్ రాబట్టి సంచలనం సృష్టించింది.

టార్గెట్ ఇలా.. లాభం అలా: విజయ్ 'లియో' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 215 కోట్లు బిజినెస్ చేయగా.. ఫుల్ రన్‌లో ఇది రూ. 305 కోట్లు రాబట్టింది. అంటే.. హిట్ స్టేటస్‌తో పాటు రూ. 89 కోట్లు లాభాలను అందుకుంది. తెలుగులో దీనికి రూ. 16 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 17 కోట్ల టార్గెట్‌తో వచ్చిన ఈ మూవీ రూ. 9.15 కోట్లు లాభాలు కూడా సొంతం చేసుకుంది.

ఏకైక సినిమాగా సంచలనం: ఇళయదళపతి విజయ్ నటించిన 'లియో' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా తమిళనాడులో ఈ చిత్రం రూ. 200 కోట్లు గ్రాస్ మార్కును దాటేసి రికార్డు క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే ఇప్పుడు ఈ చిత్రం అక్కడ రూ. 100 కోట్లు షేర్ మార్కును చేరుకుంది. తద్వారా ఈ మార్కును దాటిన ఏకైక తమిళ చిత్రంగా 'లియో' రికార్డును సాధించింది.


Click it and Unblock the Notifications











