LEO: లియో మరో సెన్సేషనల్ రికార్డు.. భారతదేశంలోనే తొలి చిత్రంగా ఘనత

విలక్షణమైన నటన, విభిన్నమైన సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న హీరోనే ఇళయదళపతి విజయ్. కెరీర్ ఆరంభం నుంచీ తన రేంజ్‌ను పెంచుకునే సినిమాలనే చేస్తున్న అతడు.. 'మాస్టర్' తర్వాత ఆ రేంజ్ హిట్‌ను అందుకోలేదు. దీంతో ఈ సారి ఎలాగైనా బిగ్ సక్సెస్ కొట్టాలన్న లక్ష్యంతో 'లియో' అనే సినిమాలో నటించాడు.

'మాస్టర్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఇళయదళపతి విజయ్ నటించిన సినిమానే 'లియో'. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ మూవీపై ఆరంభంలోనే అంచనాలు ఏర్పడగా.. వాటికి ఏమాత్రం తగ్గకుండా దీన్ని తెరకెక్కించారు. దీంతో తెలుగు, తమిళంలో ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.

Vijay Starrer LEO Movie Crosses 1 Million Doller Mark in Pre Sales in USA

ఇళయదళపతి విజయ్‌కు దక్షిణాదిలోనే కాకుండా విదేశాల్లోనూ మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉన్నాయి. అందుకు అనుగుణంగానే 'లియో' మూవీ ఓవర్సీస్ హక్కులను ప్రత్యంగిరా సంస్థ భారీ ధరకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఏఏ క్రియేషన్స్ సంస్థతో కలిసి నార్త్ అమెరికాలో ఈ చిత్రాన్ని ఎంతో గ్రాండ్‌గా రిలీజ్ చేసేందుకు ప్లాన్లు చేసుకుంది.

నార్త్ అమెరికాకు సంబంధించి 'లియో' మూవీ అడ్వాన్స్ బుకింగ్స్‌ను చాలా రోజుల క్రితమే ప్రారంభించేశారు. అక్కడ ఇళయదళపతి విజయ్ సినిమాకు ఊహించని రీతిలో హైప్ ఏర్పడడంతో టికెట్లకు భారీ డిమాండ్ వచ్చింది. ఫలితంగా ఇప్పటికే చాలా టికెట్లు కూడా అమ్ముడుపోయాయి. ఇలా ఈ సినిమా తాజాగా 1 మిలియన్ డాలర్ల మార్కును కూడా చేరుకుని సత్తా చాటుకుంది.

యూఎస్ బాక్సాఫీస్ వద్ద రిలీజ్‌కు ముందే 'లియో' చిత్రం 1 మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంది. తద్వారా 2023లో ప్రీ సేల్స్ ద్వారా ఈ మైలురాయిని చేరుకున్న ఏకైక భారత చిత్రంగా ఇది రికార్డు సాధించింది. అదే సమయంలో RRR తర్వాత ఇంత మొత్తం వసూలు చేసిన సినిమానూ నిలిచింది. ఇలా విజయ్ మూవీ రిలీజ్ ముందే రికార్డులు నమోదు చేసుకుంటోంది.

Vijay Starrer LEO Movie Crosses 1 Million Doller Mark in Pre Sales in USA

ఇక, విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన 'లియో' చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రలో నటించాడు. దీనికి అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చిత్రం అక్టోబర్ 19న రిలీజ్ కానుంది. అలాగే, అక్టోబర్ 18న యూఎస్‌లో ప్రీమియర్స్ స్టార్ట్ అవుతాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X