LEO Business: లియోకు సంచలన బిజినెస్.. టాప్ మూవీగా గొప్ప రికార్డు.. అన్ని వందల కోట్లు వస్తేనే హిట్

గతంలో కంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో భారీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రపంచ వ్యాప్తంగా ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అందులో ఇళయదళపతి విజయ్ నటించిన 'లియో' ఒకటి. పూర్తి స్థాయి యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. అందుకు ఏమాత్రం తీసిపోని విధంగా దీన్ని గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో 'లియో' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంత బిజినెస్ చేసుకుంది? ఎన్ని కోట్లు వసూలు చేస్తే ఇది హిట్ స్టేటస్‌ను చేరుకుంటుంది? అనే వివరాలు చూద్దాం పదండి!

లియోగా రాబోతున్న విజయ్:ఇళయదళపతి విజయ్ హీరోగా లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన సినిమానే 'లియో'. యాక్షన్ జోనర్‌లో రూపొందిన ఈ చిత్రాన్ని లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా చేసింది. అలాగే, సంజయ్ దత్ విలన్‌గా, అర్జున్ సర్జా కీలక పాత్రలో నటించారు. దీనికి అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు. ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కాబోతుంది.

Vijay Starrer LEO Movie Worldwide Pre Release Business Details

డబుల్ ట్రీట్.. ఫుల్ యాక్షన్:'మాస్టర్' వంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ - లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రూపొందిన 'లియో' మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రాబోతుంది. ఇందులో హీరో తండ్రి కొడుకు పాత్రలను చేస్తున్నట్లు ఇప్పటికే న్యూస్ లీకైంది. వీళ్లిద్దరి మధ్య వచ్చే సన్నివేశాలతోనే ఈ చిత్రం సాగుతుందని అంటున్నారు. ఫలితంగా లియోపై అంచనాలు అన్నీ రెట్టింపు అవుతూనే ఉన్నాయి.

గ్రాండ్‌గా రిలీజ్.. ఫుల్ బుక్:యాక్షన్ జోనర్‌లో తెరకెక్కిన 'ఆదిపురుష్' మూవీని దసరా కానుకగా అక్టోబర్ 19వ తేదీన ఎంతో గ్రాండ్‌గా ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ అన్ని ప్రాంతాల్లో ప్రమోషన్స్ చేస్తోంది. మరోవైపు, తమిళనాడు, ఓవర్సీస్ సహా తెలుగు రాష్ట్రాల్లోని ఎన్నో ప్రాంతాల్లో టికెట్లు బుకింగ్స్ కూడా ఓపెన్ అయ్యాయి. అన్ని చోట్లా భారీ రెస్పాన్స్ వస్తోంది.

Vijay Starrer LEO Movie Worldwide Pre Release Business Details

2 భాషల్లోనూ భారీ డిమాండ్:క్రేజీ కాంబినేషన్‌లో ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'లియో' మూవీపై ఎన్నో అంచనాలు ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి ఏది విడుదలైనా మంచి రెస్పాన్స్ దక్కుతూ వచ్చింది. దీంతో ఈ సినిమా హక్కులకు అన్ని ప్రాంతాల్లో భారీ డిమాండ్ ఏర్పడింది. అందుకు అనుగుణంగానే అన్ని ఏరియాల రైట్స్ హాట్ కేకుల్లా అమ్ముడైనట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి.

ఆంధ్రా, తెలంగాణ బిజినెస్:ఇళయదళపతి విజయ్‌కు తెలుగు రాష్ట్రాల్లో సైతం మంచి ఫాలోయింగ్, మార్కెట్ ఉంది. దీంతో 'లియో' మూవీకి తెలుగు రాష్ట్రాల్లో భారీ బిజినెస్ జరిగింది. ట్రేడ్ లెక్కల ప్రకారం.. ఆంధ్రా, నైజాం, సీడెడ్ ప్రాంతాలను కలుపుకుని ఈ చిత్రం రూ. 16 కోట్లు థియేట్రికల్ బిజినెస్ చేసింది. తద్వారా తెలుగులో టాప్‌లో ఉన్న అతడి చిత్రం 'వారసుడు' బిజినెస్‌ సమం చేసుకుంది.

Vijay Starrer LEO Movie Worldwide Pre Release Business Details

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే:విజయ్ నటించిన 'లియో' మూవీకి దేశ వ్యాప్తంగా కూడా మంచి డిమాండ్ వచ్చింది. దీంతో ఈ సినిమా తమిళనాడులో రూ. 100 కోట్లు, కర్నాటకలో రూ. 15.50 కోట్లు, హిందీ ప్లస్ నార్త్ ఇండియా మొత్తంలో రూ. 10 కోట్లు, కేరళలో రూ. 13.50 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 60 కోట్లు బిజినెస్ చేసింది. దీంతో ఈ మూవీకి ప్రపంచ వ్యాప్తంగా రూ. 215 కోట్లు వ్యాపారం జరిగింది.

Vijay Starrer LEO Movie Worldwide Pre Release Business Details

అన్ని కోట్ల టార్గెట్.. రికార్డు:'లియో' సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా రూ. 215 కోట్లు బిజినెస్ జరిగింది. దీంతో రూ. 217 కోట్లు షేర్ లేదా రూ. 410 కోట్లు గ్రాస్ వసూలు అయితేనే ఇది హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. ఇదిలా ఉండగా.. విజయ్ కెరీర్‌లోనే ఇది అత్యధిక బిజినెస్ చేసిన చిత్రంగా రికార్డు సాధించింది. గతంలో 'వారిసు' రూ. 137.90 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X