twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Varasudu Collection: తగ్గిన వారసుడు కలెక్షన్స్.. దాటేసిన రూ. 250 కోట్లు మార్క్, అన్ని లక్షలు వస్తేనే హిట్!

    |

    కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వరసు సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. పేరుకు కోలీవుడ్ హీరో అయిన విజయ్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ ని అతని అభిమానులు ముద్దుగా ఇళయదళపతి అని పిలుచుకుంటారు. ఇటీవల బీస్ట్ సినిమాతో ఓటమి చవిచూసిన విజయ్ తాజాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసారి ద్విభాషా చిత్రంగా వారసుడు (తమిళంలో వారిసు)తో పలకరించాడు విజయ్. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా తెలుగు వెర్షన్ జనవరి 14న, తమిళ వెర్షన్ జనవరి 11న విడుదలైంది. ఈ క్రమంలో వారసుడు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

    వారసుడుగా కోలీవుడ్ స్టార్ హీరో..

    వారసుడుగా కోలీవుడ్ స్టార్ హీరో..

    తమిళ అగ్ర హీరో విజయ్ నటించిన తాజా సినిమా 'వారసుడు'. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో శ్రీకాంత్, శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కిక్ శ్యామ్, కుష్బూ, జయసుధ కీలక పాత్రలు పోషించారు.

    వారిసు బిజినెస్ వివరాలు..

    వారిసు బిజినెస్ వివరాలు..

    ఇళయదళపతి విజయ్‌కు ప్రపంచవ్యాపతంగా ఉన్న మార్కెట్ ప్రకారమే 'వారసుడు' లేదా 'వారిసు' మూవీపై అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ చిత్రం హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా విజయ్ వారసుడు మూవికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్‌ జరిగింది.

    10వ రోజు తెలుగు వసూళ్లు..

    10వ రోజు తెలుగు వసూళ్లు..


    కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'వారసుడు' సినిమా తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదలైంది. దీంతో ఈ చిత్రానికి తమిళంలో మాదిరిగానే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఫస్ట్ వీక్ బాగానే వచ్చాయి. అయితే, రెండో వారం క్రమ క్రమంగా పడిపోతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో 10వ రోజైన సోమవారం వసూళ్లు తగ్గినట్లు తెలుస్తోంది. ఫలింతంగా తెలుగు రాష్ట్రాల్లో 10వ రోజు వారసుడు సినిమాకు రూ. 14 లక్షలు షేర్ వచ్చింది.

     మొత్తంగా 10 రోజులకు కలిపి..

    మొత్తంగా 10 రోజులకు కలిపి..

    బైలింగువల్ చిత్రం 'వారసుడు'కి తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో కలెక్షన్లు ఓ మోస్తరుగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.17 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.24 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.26 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.04 కోట్లు, వెస్ట్‌లో రూ. 81 లక్షలు, గుంటూరులో రూ. 96 లక్షలు, కృష్ణాలో రూ. 97 లక్షలు, నెల్లూరులో రూ. 6 లక్షలతో కలిపి రూ. 14.12 కోట్లు షేర్, రూ. 25.30 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూళు అయ్యాయి.

    వరల్డ్ వైడ్ గా ఎంతొచ్చింది..

    వరల్డ్ వైడ్ గా ఎంతొచ్చింది..


    కుటుంబ కథా చిత్రానికి విజయ్ మార్క్ జోడించి వంశీ పైడిపల్లి తెరకెక్కించిన 'వారిసు' సినిమా తమిళ వెర్షన్ జనవరి 11న విడుదలైంది. విజయ్ నటించిన ఈ సినిమాకు 13వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 3.50 కోట్లుకు పైగా గ్రాస్ వసూలైంది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 258 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 132.50 కోట్లు షేర్‌ను రాబట్టింది. ఫలితంగా పలు రికార్డులను క్రియేట్ చేసింది.

    హిట్ కి ఎంత రావాలంటే..

    హిట్ కి ఎంత రావాలంటే..

    విజయ్ చేసిన 'వారసుడు' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే రూ. 139 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. ఇది 13 రోజుల్లో రూ. 132.50 కోట్లు రాబట్టింది. అంటే.. మరో రూ. 6.50 కోట్లు వస్తేనే ఇది క్లీన్ హిట్ అవుతుంది. ఇక, తెలుగులో ఈ చిత్రానికి రూ. 14 కోట్లు బిజినెస్ జరగ్గా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా ఏర్పడింది. ఇప్పుడు రూ. 14.12 కోట్లు సాధించిన వారసుడు తెలుగులో క్లీన్ హిట్ కొట్టాలంటే ఇంకా రూ. 88 లక్షలు అందుకోవాలి.

    English summary
    Vijay Dil Raju Vamsi Paidipally Movie Varisu 13 Days Worldwide Box Office Collection And 10 Days Telugu States Box Office Collection.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X