twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Varasudu Collection: పెరిగిన వారసుడు కలెక్షన్స్.. అజిత్ సినిమా కంటే తక్కువే.. దిల్ రాజు సేఫ్ అవ్వాలంటే?

    |

    కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. పేరుకు కోలీవుడ్ హీరో అయిన విజయ్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ ని అతని అభిమానులు ముద్దుగా ఇళయదళపతి అని పిలుచుకుంటారు. ఇటీవల బీస్ట్ సినిమాతో ఓటమి చవిచూసిన విజయ్ తాజాగా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

    అయితే ఈసారి బైలింగువల్ సినిమాగా వారసుడు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా తమిళ వెర్షన్ జనవరి 11న, తెలుగు వెర్షన్ జనవరి 14న విడుదలైంది. ఈ క్రమంలో వారసుడు మూవీ ప్రపంచవ్యాప్తంగా వసూళైన కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

    స్టార్ కాస్టింగ్ తో వారసుడు..

    స్టార్ కాస్టింగ్ తో వారసుడు..

    తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'వారసుడు'. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఇందులో శ్రీకాంత్, శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కిక్ శ్యామ్, కుష్బూ, జయసుధ కీలక పాత్రలు పోషించారు.

    వారిసు బిజినెస్ డీటెల్స్..

    వారిసు బిజినెస్ డీటెల్స్..

    ఇళయదళపతి విజయ్‌కు ప్రపంచవ్యాపతంగా ఉన్న మార్కెట్ ప్రకారమే 'వారసుడు' లేదా 'వారిసు' సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ చిత్రం హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా విజయ్ వారసుడు మూవికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్‌ జరిగింది. దీంతో రూ. 139 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నమోదు అయింది.

     16వ రోజు తెలుగు వసూళ్లు..

    16వ రోజు తెలుగు వసూళ్లు..

    కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'వారసుడు' సినిమా తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదలైంది. దీంతో ఈ చిత్రానికి తమిళంలో మాదిరిగానే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఫస్ట్ వీక్ బాగానే వచ్చాయి. అయితే, రెండో వారం క్రమ క్రమంగా పడిపోతూ వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో 16వ రోజున వారసుడు సినిమాకు రూ. 27 లక్షలు షేర్ వచ్చింది. ఇలా చూసుకుంటే తెలుగులో అజిత్ సినిమా కన్నా పర్వాలేదనిపిస్తోంది.

    మొత్తంగా 16 రోజులకు కలిపి..

    మొత్తంగా 16 రోజులకు కలిపి..

    బైలింగువల్ చిత్రంగా వచ్చిన 'వారసుడు'కి తెలుగు రాష్ట్రాల్లో 16 రోజుల్లో కలెక్షన్లు ఓ మోస్తరుగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.47 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.36 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.37 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.15 కోట్లు, వెస్ట్‌లో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.01 కోట్లు, కృష్ణాలో రూ. 1.02 కోట్లు, నెల్లూరులో రూ. 70 లక్షలతో కలిపి రూ. 14.92 కోట్లు షేర్, రూ. 26.90 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూళు అయ్యాయి.

    వరల్డ్ వైడ్ గా 19 రోజుల్లో ఎంతొచ్చింది..

    వరల్డ్ వైడ్ గా 19 రోజుల్లో ఎంతొచ్చింది..

    కుటుంబ కథా చిత్రానికి విజయ్ మార్క్ జోడించి వంశీ పైడిపల్లి తెరకెక్కించిన 'వారిసు' సినిమా తమిళ వెర్షన్ జనవరి 11న విడుదలైంది. విజయ్ నటించిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 19 రోజుల్లో తమిళనాడులో రూ. 127.95 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో తమిళ వెర్షన్ కు కలుపుకుని రూ. 27.45 కోట్లు, కర్ణాటకలో రూ. 14.40 కోట్లు, కేరళలో రూ. 11.90 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 14.15 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 84.45 కోట్లు వసూలు చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 280.30 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 143.02 కోట్లు షేర్‌ను రాబట్టింది.

    హిట్ కి ఎంత రావాలంటే..

    హిట్ కి ఎంత రావాలంటే..

    విజయ్ చేసిన 'వారసుడు' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే రూ. 139 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. ఇది 19 రోజుల్లో రూ. 143.02 కోట్లు రాబట్టింది. అంటే.. రూ. 4.02 కోట్ల ప్రాఫిట్ సాధించి హిట్ స్టేటస్ సొంతం చేసుకుంది. అయితే అజిత్ తునివు సినిమాతో పోల్చుకుంటే ఈ సినిమాకు చాలా తక్కువగా లాభాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇక, తెలుగులో ఈ చిత్రానికి రూ. 14 కోట్లు బిజినెస్ జరగ్గా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా ఏర్పడింది. ఇప్పుడు రూ. 14.92 కోట్లు సాధించిన వారసుడు తెలుగులో క్లీన్ హిట్ కొట్టాలంటే ఇంకా రూ. 8 లక్షలు అందుకోవాలి.

    English summary
    Vijay Dil Raju Vamsi Paidipally Movie Varisu 19 Days Worldwide Box Office Collection And 16 Days Telugu States Box Office Collection.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X