Varasudu Collection: 300 కోట్ల క్లబ్‌లో విజయ్ వారసుడు.. దిల్ రాజుకు ప్రాఫిట్ ఎంతంటే?

తమిళ అగ్ర కథానాయకుడు విజయ్ వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. పేరుకు కోలీవుడ్ హీరో అయిన విజయ్ కు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫ్యాన్స్ ఉన్నారు. విజయ్ ని అతని అభిమానులు ముద్దుగా ఇళయదళపతి అని పిలుచుకుంటారు. ఇటీవల బీస్ట్ సినిమాతో ఓటమి చవిచూసిన విజయ్ లేటెస్ట్ గా ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే ఈసారి ద్విభాషా చిత్రంగా వారసుడు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. సంక్రాంతి కానుకగా వచ్చిన ఈ సినిమా తమిళ వెర్షన్ జనవరి 11న, తెలుగు వెర్షన్ జనవరి 14న విడుదలైంది. ఈ క్రమంలో వారసుడు మూవీ ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ వివరాల్లోకి వెళితే..

 తమన్ సంగీతం..

తమన్ సంగీతం..

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ 'వారసుడు'. టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ తమన్ సంగీతం అందించాడు. ఇందులో శ్రీకాంత్, శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కిక్ శ్యామ్, కుష్బూ, జయసుధ కీలక పాత్రలు పోషించారు.

 వారిసు బిజినెస్ వివరాలు..

వారిసు బిజినెస్ వివరాలు..

ఇళయదళపతి విజయ్‌కు ప్రపంచవ్యాపతంగా ఉన్న మార్కెట్ ప్రకారమే 'వారసుడు' లేదా 'వారిసు' సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగినట్లుగానే ఈ చిత్రం హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా విజయ్ వారసుడు మూవికి ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్‌ జరిగింది. దీంతో రూ. 139 కోట్లుగా బ్రేక్ ఈవెన్ టార్గెట్ గా నమోదు అయింది.

తెలుగు రాష్ట్రాల్లో 23 రోజులకు కలిపి..

తెలుగు రాష్ట్రాల్లో 23 రోజులకు కలిపి..

బైలింగువల్ చిత్రంగా వచ్చిన 'వారసుడు'కి తెలుగు రాష్ట్రాల్లో 23 రోజుల్లో కలెక్షన్లు ఓ మోస్తరుగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.38 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.40 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.17 కోట్లు, వెస్ట్‌లో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.01 కోట్లు, కృష్ణాలో రూ. 1.03 కోట్లు, నెల్లూరులో రూ. 70 లక్షలతో కలిపి రూ. 15.05 కోట్లు షేర్, రూ. 27.10 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ వసూళు అయ్యాయి.

 వరల్డ్ వైడ్ గా 26 రోజుల్లో ఎంతొచ్చింది..

వరల్డ్ వైడ్ గా 26 రోజుల్లో ఎంతొచ్చింది..

కుటుంబ కథా చిత్రానికి విజయ్ మార్క్ జోడించి వంశీ పైడిపల్లి తెరకెక్కించిన 'వారిసు' సినిమా తమిళ వెర్షన్ జనవరి 11న విడుదలైంది. విజయ్ నటించిన ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 26 రోజుల్లో తమిళనాడులో రూ. 139.40 కోట్లు, తెలుగు రాష్ట్రాల్లో తమిళ వెర్షన్ కు కలుపుకుని రూ. 27.65 కోట్లు, కర్ణాటకలో రూ. 14.55 కోట్లు, కేరళలో రూ. 11.96 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 14.35 కోట్లు, ఓవర్సీస్ లో రూ. 86.86 కోట్లు వసూలు చేసింది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 294.77 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 150.42 కోట్లు షేర్‌ను రాబట్టింది.

ప్రాఫిట్ ఎంతంటే..

ప్రాఫిట్ ఎంతంటే..

విజయ్ చేసిన 'వారసుడు' సినిమాకు అంచనాలకు అనుగుణంగానే రూ. 139 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. ఇది 26 రోజుల్లో రూ. 152.42 కోట్లు రాబట్టింది. అంటే.. రూ. 11.42 కోట్ల ప్రాఫిట్ సాధించి హిట్ స్టేటస్ సొంతం చేసుకుంది. ఇక, తెలుగులో ఈ చిత్రానికి రూ. 14 కోట్లు బిజినెస్ జరగ్గా.. బ్రేక్ ఈవెన్ టార్గెట్ రూ. 15 కోట్లుగా ఏర్పడింది. ఇప్పుడు రూ. 15.05 కోట్లు సాధించిన వారసుడు తెలుగులో బ్రేక్ ఈవెన్ సాధించి రూ. 5 లక్షలు లాభం పొందింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X