twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Varasudu Business: తెలుగులో విజయ్ రికార్డు.. వారసుడు మూవీకి అన్ని కోట్లు.. దిల్ రాజు గట్టెక్కాలంటే!

    |

    దక్షిణాదిలోని స్టార్ హీరోలతో పోలిస్తే.. సుదీర్ఘ కాలంగా తన ప్రత్యేకతను చాటుకుంటూ టాప్ హీరోగా వెలుగొందుతున్నాడు కోలీవుడ్ స్టార్ ఇళయదళపతి విజయ్. విభిన్నమైన చిత్రాలతో, విలక్షణమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న అతడు.. అన్ని ప్రాంతాల్లోనూ మార్కెట్‌ను పెంచుకుని దూసుకుపోతోన్నాడు. ఇక, కొన్నేళ్లుగా వరుస విజయాలను అందుకుంటూ సత్తా చాటుతోన్న విజయ్.. ఇప్పుడు 'వారసుడు' (తమిళంలో వారిసు) అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మూవీ బిజినెస్‌పై ఓ లుక్కేద్దాం పదండి!

    వారసుడుగా వస్తున్న విజయ్

    వారసుడుగా వస్తున్న విజయ్

    కోలీవుడ్ స్టార్ విజయ్ హీరోగా నటించిన తాజా చిత్రమే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ తదితరులు నటించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని అందించాడు.

    బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!బిగ్ బాస్ శ్రీ సత్య బాత్రూం ఫొటోలు వైరల్: అబ్బో ఆమెనిలా చూశారంటే!

    అలాంటి కథ.. అంచనాలతో

    అలాంటి కథ.. అంచనాలతో

    కార్పోరేట్ దిగ్గజం అయిన బిజినెస్‌మ్యాన్ అనుకోని పరిస్థితుల వల్ల కష్టాల్లో పడడంతో ఆయన కొడుకు వచ్చి ఆ సమస్యలను ఎలా పరిష్కరించాడు అన్న కథతో 'వారసుడు' మూవీ తెరకెక్కింది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన అన్ని ప్రచార చిత్రాలకు భారీ స్పందన దక్కింది. అలాగే, పాటలూ అదరగొట్టేశాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు తారాస్థాయిలోనే ఏర్పడ్డాయి.

    రిలీజ్ డేట్ ఇష్యూతో రచ్చ

    రిలీజ్ డేట్ ఇష్యూతో రచ్చ

    'వారసుడు' మూవీని సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ఎప్పుడో ప్రకటించారు. ఆ తర్వాత పలు చిత్రాలు కూడా పండగ రేసులో నిలిచాయి. ఇలాంటి పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ఇష్యూ కారణంగా వివాదం చెలరేగింది. అలాగే, తమిళంలోనూ కొన్ని ఇబ్బందులు వచ్చాయి. దీంతో ఈ సినిమా రిలీజ్ డేట్‌పై ఇప్పటికీ సందిగ్ధత నెలకొంది.

    జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!జబర్ధస్త్ రీతూ ఓవర్ డోస్ హాట్ షో: డ్రెస్ సైజ్ తగ్గించి మరీ టెంప్ట్ చేస్తూ!

    ప్రమోషన్స్.. తెలుగులో ఇలా

    ప్రమోషన్స్.. తెలుగులో ఇలా

    'వారసుడు' మూవీని సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రకటించింది. ఈ మేరకు చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ఎప్పుడో ప్రారంభించింది. ఇందులో భాగంగానే తమిళంలో ఈవెంట్‌ను కూడా నిర్వహించారు. కానీ, తెలుగులో మాత్రం దీనికి పెద్దగా ప్రచారం చేయడం లేదు. ఇది సినిమాకు ఇబ్బందిగా మారొచ్చు.

    ఏ ఏరియాలో ఎంత బిజినెస్

    ఏ ఏరియాలో ఎంత బిజినెస్

    విజయ్ హీరోగా నటించిన 'వారిసు' లేదా 'వారసుడు' మూవీకి తమిళనాడులో ఏకంగా రూ. 72 కోట్లు బిజినెస్ జరిగినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి. అలాగే, కేరళలో రూ. 6.50 కోట్లు, కర్నాటకలో రూ. 7.50 కోట్లు, నార్త్ ఇండియాలో రూ. 3 కోట్లు బిజినెస్ అయింది. అలాగే ఓవర్సీస్‌లో దీనికి రూ. 35 కోట్లు వ్యాపారం జరిగింది. ఇలా మొత్తంగా రూ. 126 కోట్లు బిజినెస్ అయింది.

    బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!బిడ్డకు పాలిచ్చే వీడియో వదిలిన సీరియల్ హీరోయిన్: ఆమె ఎందుకిలా చేసిందో తెలిస్తే!

    తెలుగులో బిజినెస్ డీటేల్స్

    తెలుగులో బిజినెస్ డీటేల్స్

    తమిళ హీరో విజయ్ నటించిన 'వారసుడు' మూవీకి తెలుగులో రికార్డు స్థాయిలో బిజినెస్ జరిగింది. తాజా సమాచారం ప్రకారం.. నైజాం ఏరియాలో రూ. 6 కోట్లు, సీడెడ్‌లో రూ. 2 కోట్లు, ఆంధ్రా ఏరియా మొత్తంలో కలిపి రూ. 8 కోట్లు బిజినెస్ జరిగింది. ఇలా ఆంధ్రా, తెలంగాణలో కలిపి రూ. 16 కోట్లు వ్యాపారం అయింది. అంటే.. ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ. 142 కోట్లు బిజినెస్ జరిగింది.

    దిల్ రాజు గట్టెక్కాలంటే..!

    దిల్ రాజు గట్టెక్కాలంటే..!

    గతంలో ఎన్నడూ లేని విధంగా విజయ్ సినిమాకు తెలుగులో రూ. 16 కోట్లు మేర ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే.. రూ. 17 కోట్లు షేర్ వసూలు అయితేనే ఈ సినిమా క్లీన్ హిట్ స్టేటస్‌ను సొంతం చేసుకుంటుంది. అప్పుడే నిర్మాత దిల్ రాజు తెలుగులో లాభపడతారని ట్రేడ్ వర్గాలు తెలిపాయి. ఇక, సంక్రాంతికి వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య, తెగింపు కూడా రాబోతున్నాయి.

    English summary
    Kollywood Star Hero Vijay Did Varasudu Movie Under Vamshi Paidipally Direction. Lets See This Movie Pre Release Business Details.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X