Varisu 27 Days Collections: జాక్‌పాట్ కొట్టిన దిల్ రాజు.. వారసుడికి అన్ని వందల కోట్లు.. లాభం ఎంతంటే!

తెలుగులో మాదిరిగానే తమిళంలోనూ ఎంతో మంది హీరోలు దేశ వ్యాప్తంగా గుర్తింపును సొంతం చేసుకున్నారు. అందులో కోలీవుడ్ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఒకడు. యాక్టింగ్‌తో పాటు అన్ని టాలెంట్లతో అదరగొట్టేసిన అతడు.. సుదీర్ఘ కాలంగా ప్రభావాన్ని చూపిస్తూ తన రేంజ్‌ను పెంచుకుంటోన్నాడు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి 'వారసుడు' (తమిళంలో వారిసు) అనే సినిమాను చేశాడు. దీనికి ఆరంభంలో మంచి వసూళ్లు వచ్చినా.. క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో 'వారసుడు' మూవీకి 27 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చిందో చూడండి!

‘వారసుడు'గా విజయ్ ప్రవేశం

‘వారసుడు'గా విజయ్ ప్రవేశం

కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమానే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ కీలక పాత్రలను చేశారు.

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్

స్టార్ హీరో విజయ్‌ రేంజ్ ప్రకారమే 'వారసుడు' లేదా 'వారిసు' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్‌ చేసుకుంది.

24వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా

24వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా

విజయ్ నటించిన 'వారసుడు' మూవీ తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదలైంది. దీంతో ఈ చిత్రానికి తమిళంలో మాదిరిగానే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఫస్ట్ వీక్ బానే వచ్చాయి. అయితే, తర్వాత క్రమంగా పడిపోయాయి. అయినప్పటికీ దీనికి కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఇలా 27 రోజుల్లో ఈ చిత్రం రూ. 15.30 కోట్లు షేర్, రూ. 27.65 కోట్లు గ్రాస్ వచ్చింది.

దారుణంగా నిధి అగర్వాల్ హాట్ షో: పైనా కిందా ఏమీ లేకుండానే!

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఇళయదళపతి విజయ్ 'వారిసు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుకుంది. ఈ సినిమాకు తమిళనాడులో రూ. 140.05 కోట్లు, కర్నాటకలో రూ. 14.58 కోట్లు, కేరళలో రూ. 12.04 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 14.35 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 86.90 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 27 రోజుల్లో రూ. 301 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 150.85 కోట్లు వరకూ షేర్‌ను దక్కింది.

విజయ్ సినిమాకు లాభాలిలా!

విజయ్ సినిమాకు లాభాలిలా!

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ చేసిన 'వారసుడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే రూ. 139 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. ఇది 27 రోజుల్లో రూ. 150.85 కోట్లు రాబట్టింది. తద్వారా రూ. 11.85 కోట్లు లాభాలను అందుకుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 14 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే.. 15 కోట్ల టార్గెట్‌కు 24 రోజుల్లో రూ. 30 లక్షలు వరకూ లాభాలు సొంతం అయ్యాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X