Varisu 3 Weeks Collections: దిల్ రాజుకు జాక్‌పాట్.. వారసుడు టార్గెట్ ఫినీష్.. లాభం ఎన్ని కోట్లంటే!

కోలీవుడ్‌కు చెందిన కొంత మంది హీరోలకు దేశ వ్యాప్తంగా క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అందులో విలక్షణ నటన, విభిన్నమైన చిత్రాలతో తనదైన రీతిలో సత్తా చాటుతోన్న ఇళయదళపతి విజయ్ ఒకడు. కెరీర్ ఆరంభం నుంచీ ఫలితాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాల మీద సినిమాలు చేస్తోన్న అతడు.. ఈ సంక్రాంతికి 'వారసుడు' (తమిళంలో వారిసు) అనే సినిమాను చేశాడు. ఈ తమిళ వెర్షన్ 18వ తేదీనే విడుదలైన ఈ మూవీ తెలుగులో 14న వచ్చింది. దీనికి ఆరంభంలో మంచి వసూళ్లు వచ్చినా.. క్రమంగా డౌన్ అవుతోన్నాయి. ఈ నేపథ్యంలో 'వారసుడు' మూవీకి 3 వారాల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చిందో చూడండి!

వారసుడుగా విజయ్ విశ్వరూపం

వారసుడుగా విజయ్ విశ్వరూపం

తమిళ టాప్ హీరో విజయ్ నటించిన తాజా సినిమానే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ కీలక పాత్రలు పోషించారు.

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్

ఇళయదళపతి విజయ్‌ రేంజ్ ప్రకారమే 'వారసుడు' లేదా 'వారిసు' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్‌ జరుపుకుంది.

18వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా

18వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా


కోలీవుడ్ స్టార్ మీరో విజయ్ నటించిన 'వారసుడు' మూవీ తెలుగులో కాస్త ఆలస్యంగా విడుదలైంది. దీంతో ఈ చిత్రానికి తమిళంలో మాదిరిగానే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కానీ, కలెక్షన్లు మాత్రం ఫస్ట్ వీక్ బానే వచ్చాయి. అయితే, రెండో వారం క్రమంగా పడిపోయాయి. ఇలాంటి పరిస్థితుల్లో 18వ రోజైన మంగళవారం దీనికి రూ. 3 లక్షలు షేర్ మాత్రమే వచ్చింది.

18 రోజులకూ కలిపి ఎంతంటే?

18 రోజులకూ కలిపి ఎంతంటే?

'వారసుడు' చిత్రానికి 18 రోజుల్లో తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఓ మోస్తరుగా వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.51 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.37 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.39 కోట్లు, ఈస్ట్‌లో రూ. 1.17 కోట్లు, వెస్ట్‌లో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.01 కోట్లు, కృష్ణాలో రూ. 1.02 కోట్లు, నెల్లూరులో రూ. 70 లక్షలతో కలిపి రూ. 15.01 కోట్లు షేర్, రూ. 27.02 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన విజయ్ 'వారిసు' మూవీ తమిళ వెర్షన్ జనవరి 11న విడుదలైంది. ఈ సినిమాకు తమిళనాడులో రూ. 133.45 కోట్లు, కర్నాటకలో రూ. 14.47 కోట్లు, కేరళలో రూ. 11.94 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 14.30 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 14.30 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి 3 వారాల్లో రూ. 287.01 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 146.42 కోట్లు వరకూ షేర్‌ను దక్కింది.

విజయ్ సినిమాకు లాభాలిలా!

విజయ్ సినిమాకు లాభాలిలా!

విజయ్ చేసిన 'వారసుడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే రూ. 139 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. ఇది 21 రోజుల్లో రూ. 146.42 కోట్లు రాబట్టింది. తద్వారా రూ. 7.42 కోట్లు లాభాలను అందుకుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 14 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే.. 15 కోట్ల టార్గెట్‌కు 18 రోజుల్లో రూ. 1 లక్ష లాభాలు సొంతం అయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X