Varasudu Official Collections: వారసుడు మాస్ కొట్టుడు.. ఓవరాల్‌గా రికార్డు.. తెలుగులో ఎన్ని కోట్లంటే!

సాదాసీదాగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగి.. సౌతిండియా మొత్తంలో ప్రభావాన్ని చూపిస్తున్నాడు ఇళయదళపతి విజయ్. తనదైన నటనతో సుదీర్ఘ కాలంగా ప్రేక్షకులను అలరిస్తోన్న అతడు.. ఫలితాలతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లితో 'వారసుడు' అనే సినిమాను చేశాడు. ఈ తమిళ వెర్షన్ 11వ తేదీనే విడుదలైన ఈ మూవీ తెలుగులో 14న వచ్చింది. ఈ నేపథ్యంలో విజయ్ నటించిన 'వారసుడు' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూడండి!

వారసుడిగా మారిన కోలీవుడ్ స్టార్

వారసుడిగా మారిన కోలీవుడ్ స్టార్

కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన తాజా చిత్రమే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు.

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్

ఇళయదళపతి విజయ్ మార్కెట్‌తో పాటు 'వారసుడు' లేదా 'వారిసు' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్‌ను జరుపుకుంది.

2వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా

2వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా

'వారసుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 1.33 కోట్లు, సీడెడ్‌లో రూ. 39 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 36 లక్షలు, ఈస్ట్‌లో రూ. 19 లక్షలు, వెస్ట్‌లో రూ. 17 లక్షలు, గుంటూరులో రూ. 18 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 13 లక్షలతో కలిపి రూ. 2.94 కోట్లు షేర్, రూ. 5.40 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

2 రోజులకూ కలిపి ఎంతంటే?

2 రోజులకూ కలిపి ఎంతంటే?

2 రోజుల్లో 'వారసుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 2.73 కోట్లు, సీడెడ్‌లో రూ. 84 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 76 లక్షలు, ఈస్ట్‌లో రూ. 37 లక్షలు, వెస్ట్‌లో రూ. 34 లక్షలు, గుంటూరులో రూ. 36 లక్షలు, కృష్ణాలో రూ. 38 లక్షలు, నెల్లూరులో రూ. 26 లక్షలతో కలిపి రూ. 6.04 కోట్లు షేర్, రూ. 11.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


క్రేజీ కాంబినేషన్‌లో ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వారిసు' మూవీ తమిళ వెర్షన్ జనవరి 11న విడుదలైంది. విజయ్ నటించిన ఈ సినిమాకు అన్ని ఏరియాల్లోనూ ఓ మోస్తరు వసూళ్లు వస్తున్నాయి. ఇలా ఐదు రోజులకు కలిపి ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 150.50 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 68.40 కోట్లు షేర్‌ను రాబట్టింది. ఫలితంగా బాక్సాఫీస్ దగ్గర పోరాటం చేస్తోంది.

హిట్ అవ్వాలంటే ఎంత రావాలి

హిట్ అవ్వాలంటే ఎంత రావాలి


కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన 'వారసుడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 137.90 కోట్లు బిజినెస్ చేయగా.. ఐదు రోజుల్లో రూ. 68.40 కోట్లు రాబట్టింది. అంటే.. మరో రూ. 70.60 కోట్లు వస్తేనే ఇది క్లీన్ హిట్ అవుతుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 14 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 15 కోట్ల టార్గెట్‌కు ఇంకా రూ. 8.96 కోట్లు వసూలు కావాలి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X