twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Varasudu Official Collections: విజయ్ సెన్సేషన్.. ఒక్కరోజే 25 కోట్లు.. హిట్‌కు అన్ని కోట్లు దూరంలో!

    |

    విలక్షణమైన నటనతో పాటు విభిన్నమైన సినిమాలు చేస్తూ తమిళ సినీ ఇండస్ట్రీలో సుదీర్ఘ కాలంగా స్టార్‌గా వెలుగొందుతోన్నాడు ఇళయదళపతి విజయ్. సినిమా సినిమాకూ తన రేంజ్‌ను పెంచుకుంటూ వెళ్తోన్న అతడు.. ఈ మధ్య కాలంలో భారీ సక్సెస్ లేక ఇబ్బంది పడుతోన్నాడు. దీంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో 'వారసుడు' తమిళంలో (వారిసు) అనే సినిమాను చేశాడు. ఈ తమిళ వెర్షన్ 11వ తేదీనే విడుదలైన ఈ మూవీ తెలుగులో 14న వచ్చింది. ఈ నేపథ్యంలో 'వారసుడు' మూవీకి ప్రపంచ వ్యాప్తంగా కలెక్షన్లు ఎలా ఉన్నాయో చూద్దామా!

    వారసుడిగా వచ్చిన స్టార్ హీరో

    వారసుడిగా వచ్చిన స్టార్ హీరో

    తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రమే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ తదితరులు కీలక పాత్రలు చేశారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతాన్ని సమకూర్చాడు.

    ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్ఆ ఇద్దరి వల్లే జబర్ధస్త్ మానేసిన అనసూయ: అన్ని లక్షలు ఆఫర్ చేసినా.. పర్సనల్ సీక్రెట్ లీక్

    విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్

    విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్


    కోలీవుడ్ స్టార్ విజయ్ మార్కెట్‌తో పాటు 'వారసుడు' లేదా 'వారిసు' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్‌ను చేసుకుంది.

    3వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా

    3వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా


    'వారసుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో మూడో రోజు మంచి స్పందనే వచ్చింది. ఫలితంగా నైజాంలో రూ. 94 లక్షలు, సీడెడ్‌లో రూ. 43 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 43 లక్షలు, ఈస్ట్‌లో రూ. 21 లక్షలు, వెస్ట్‌లో రూ. 15 లక్షలు, గుంటూరులో రూ. 20 లక్షలు, కృష్ణాలో రూ. 19 లక్షలు, నెల్లూరులో రూ. 14 లక్షలతో కలిపి రూ. 2.69 కోట్లు షేర్, రూ. 5.00 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    జబర్ధస్త్ నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ట్విస్ట్: పెళ్లికి ముందు షాక్.. నిజంగా కుదరదు అంటూ!జబర్ధస్త్ నూకరాజు ఆసియా లవ్ స్టోరీలో ట్విస్ట్: పెళ్లికి ముందు షాక్.. నిజంగా కుదరదు అంటూ!

    3 రోజులకూ కలిపి ఎంతంటే?

    3 రోజులకూ కలిపి ఎంతంటే?


    3 రోజుల్లో 'వారసుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు బాగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 3.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.27 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 1.19 కోట్లు, ఈస్ట్‌లో రూ. 58 లక్షలు, వెస్ట్‌లో రూ. 49 లక్షలు, గుంటూరులో రూ. 56 లక్షలు, కృష్ణాలో రూ. 57 లక్షలు, నెల్లూరులో రూ. 40 లక్షలతో కలిపి రూ. 8.73 కోట్లు షేర్, రూ. 16.20 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

    ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది


    ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రతిష్టాత్మకంగా రూపొందిన 'వారిసు' మూవీ తమిళ వెర్షన్ జనవరి 11న విడుదలైంది. విజయ్ నటించిన ఈ సినిమాకు 6వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 25 కోట్లుకు పైగా గ్రాస్ వసూలైంది. ఇలా ఆరు రోజులకు కలిపి ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 186.75 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 87.25 కోట్లు షేర్‌ను రాబట్టింది. దీంతో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి.

    ఐటెం గర్ల్ హాట్ వీడియో వైరల్: అడల్ట్ మూవీని తలపించేలా ఘోరంగా!ఐటెం గర్ల్ హాట్ వీడియో వైరల్: అడల్ట్ మూవీని తలపించేలా ఘోరంగా!

    హిట్ అవ్వాలంటే ఎంత రావాలి

    హిట్ అవ్వాలంటే ఎంత రావాలి

    విజయ్ నటించిన 'వారసుడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 137.90 కోట్లు బిజినెస్ చేయగా.. ఐదు రోజుల్లో రూ. 84.25 కోట్లు రాబట్టింది. అంటే.. మరో రూ. 53.65 కోట్లు వస్తేనే ఇది క్లీన్ హిట్ అవుతుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 14 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 15 కోట్ల టార్గెట్‌కు ఇంకా రూ. 6.27 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

    English summary
    Kollywood Star Hero Vijay Did Varasudu Movie Under Vamshi Paidipally Direction. This Movie Collects Rs 150.5 Crore in 6 Days.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X