Varasudu Official Collections: మరోసారి డబుల్ సెంచరీ కొట్టిన విజయ్.. దిల్ రాజుకి ఇంకా ఎంత రావాలంటే?
తమిళ సినిమా ఇండస్ట్రీలో అత్యధిక స్థాయిలో తన మార్కెట్ను పెంచుకుంటున్న హీరోలను విజయవరు అతను ఎలాంటి సినిమా చేసిన కూడా బాక్సాఫీస్ వద్ద టాప్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ అందుకుంటూ ఉంటాయి ఇక ఈసారి దిల్ రాజు ప్రొడక్షన్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేసిన వారసుడు సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది తమిళంలో ఈ సినిమాను మొదట 11వ తేదీన విడుదల చేయగా తర్వాత తెలుగులో జనవరి 14వ తేదీన విడుదల చేశారు వారంలో ఎంత కలెక్షన్స్ అందుకుంది అలాగే ప్రాఫిట్ లోకి రావాలి అంటే ఇంకా ఎంత వెనక్కి తీసుకురావాలి అనే వివరాల్లోకి వెళితే..

ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత?
కోలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఇంతకాలం పాటు వరుసగా బాక్సాఫీస్ సక్సెస్ అందుకుంటున్న విజయ్ తెలుగులో కూడా తన మార్కెట్ పెంచుకోవాలని అనుకున్నాడు. ఇక వారసుడు సినిమాకు డిమాండ్ కు తగ్గట్టుగానే మంచి బిజినెస్ చేసింది. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించగా ముఖ్యమైన పాత్రలలో శ్రీకాంత్, శరత్ కుమార్ నటించారు. ఇక ఈ సినిమా డిమాండ్ కు తగ్గట్టుగా ప్రపంచవ్యాప్తంగా 137.90 కోట్ల వరకు బిజినెస్ చేసింది.

4 రోజుల తెలుగు కలెక్షన్స్
4 రోజుల్లో 'వారసుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు ఇలా వచ్చాయి. నైజాంలో రూ. 4.27 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.66 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 1.56 కోట్లు, ఈస్ట్‌లో రూ. 78 లక్షలు, వెస్ట్‌లో రూ. 63 లక్షలు, గుంటూరులో రూ. 74 లక్షలు, కృష్ణాలో రూ. 74 లక్షలు, నెల్లూరులో రూ. 52 లక్షలతో కలిపి రూ. 10.90 కోట్లు షేర్, రూ. 20.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్
గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదట 'వారిసు'గా తమిళ వెర్షన్ లో జనవరి 11న విడుదలైంది. ఇక తెలుగు తమిళంలో 7రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా అందుకున్న గ్రాస్ కలెక్షన్స్ ఈ విధంగా ఉన్నాయి. తమిళనాడులో 89.40 కోట్లు తెలుగు రాష్ట్రాల్లో 20.70 కోట్లు, కర్ణాటకలో 11.8 కోట్లు, కేరళలో 10.30 కోట్లు ఇక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 9.50 కోట్లు, ఓవర్సీస్ లో 71.80 కోట్లు ప్రపంచవ్యాప్తంగా 213.50 కోట్లు గ్రాస్ కలెక్షన్స్, 109 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి.

ఇంకా ఎంత రావాలి అంటే..
వారసుడు/వారిసు మూవీకి అంచనాలకు అనుగుణంగానే ప్రపంచ వ్యాప్తంగా రూ. 137.90 కోట్లు బిజినెస్ చేసింది. ఇక 7 రోజుల్లో రూ. 109 కోట్ల షేర్ రాబట్టింది. ఇక సినిమా నష్టపోకుండా ఉండాలి అంటే మరో రూ. 30 కోట్లు షేర్ వస్తేనే క్లీన్ హిట్ అవుతుంది. తెలుగులో ఈ సినిమా రూ. 14 కోట్లు బిజినెస్ చేసింది. అంటే 15 కోట్ల టార్గెట్‌కు ఇంకా రూ. 5 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.


Click it and Unblock the Notifications











