Varasudu Collections: విజయ్‌కు బిగ్ షాక్.. ఒక్కసారిగా వసూళ్లు డౌన్.. ఇంకా అన్ని కోట్లు వస్తేనే హిట్

అదిరిపోయే యాక్టింగ్, ఆకట్టుకునే డ్యాన్స్, మైమరపించే ఫైట్స్ ఇలా ఎన్నో రకాలుగా ప్రేక్షకులను అలరిస్తూ.. సుదీర్ఘ కాలంగా సౌతిండియాలోనే స్టార్‌గా వెలుగొందుతోన్నాడు ఇళయదళపతి విజయ్. ఈ మధ్య కాలంలో క్రమంగా తన రేంజ్‌ను పెంచుకుంటోన్న అతడు.. మరింత ఉత్సాహంగా సినిమాలు చేస్తోన్నాడు. ఈ క్రమంలోనే ఇటీవలే విజయ్ 'వారసుడు' తమిళంలో (వారిసు) అనే సినిమాను చేశాడు. ఈ తమిళ వెర్షన్ 11వ తేదీనే విడుదలైన ఈ మూవీ తెలుగులో 14న వచ్చింది. ఈ నేపథ్యంలో 'వారసుడు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా ఎంత రాబట్టిందో చూద్దాం పదండి!

వారసుడుగా విజయ్ విశ్వరూపం

వారసుడుగా విజయ్ విశ్వరూపం

కోలీవుడ్ స్టార్ విజయ్ నటించిన తాజా సినిమానే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, కుస్భూ, జయసుధ తదితరులు నటించారు.

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్

దేశ వ్యాప్తంగా విజయ్‌కు ఉన్న క్రేజ్, 'వారసుడు' లేదా 'వారిసు' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్‌ను చేసుకుంది.

6వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా

6వ రోజు తెలుగు కలెక్షన్లు ఇలా

విజయ్ 'వారసుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు బిగ్ షాక్ తగిలింది. ఫలితంగా నైజాంలో రూ. 14 లక్షలు, సీడెడ్‌లో రూ. 12 లక్షలు, ఉత్తరాంధ్రాలో రూ. 16 లక్షలు, ఈస్ట్‌లో రూ. 4 లక్షలు, వెస్ట్‌లో రూ. 4 లక్షలు, గుంటూరులో రూ. 5 లక్షలు, కృష్ణాలో రూ. 5 లక్షలు, నెల్లూరులో రూ. 3 లక్షలతో కలిపి రూ. 63 లక్షలు షేర్, రూ. 95 లక్షలు గ్రాస్ వసూలు అయింది.

6 రోజులకూ కలిపి ఎంతంటే?

6 రోజులకూ కలిపి ఎంతంటే?


6 రోజుల్లో 'వారసుడు' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు భారీగానే వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 4.67 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.03 కోట్లు, ఉత్తరాంధ్రాలో రూ. 2.06 కోట్లు, ఈస్ట్‌లో రూ. 95 లక్షలు, వెస్ట్‌లో రూ. 74 లక్షలు, గుంటూరులో రూ. 88 లక్షలు, కృష్ణాలో రూ. 89 లక్షలు, నెల్లూరులో రూ. 61 లక్షలతో కలిపి రూ. 12.83 కోట్లు షేర్, రూ. 23.25 కోట్లు గ్రాస్ వసూలు అయింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ప్రపంచ వ్యాప్తంగా ఎంతొచ్చింది

ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన 'వారిసు' మూవీ తమిళ వెర్షన్ జనవరి 11న విడుదలైంది. విజయ్ నటించిన ఈ సినిమాకు 9వ రోజు ప్రపంచ వ్యాప్తంగా రూ. 5.50 కోట్లుకు పైగా గ్రాస్ వసూలైంది. ఇలా ఇప్పటి వరకూ ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 231 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 116.50 కోట్లు షేర్‌ను రాబట్టింది. దీంతో పలు రికార్డులు కూడా నమోదయ్యాయి.

హిట్ అవ్వాలంటే ఎంత రావాలి

హిట్ అవ్వాలంటే ఎంత రావాలి

ఇళయదళపతి విజయ్ 'వారసుడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే రూ. 139 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. ఇది 9 రోజుల్లో రూ. 116.50 కోట్లు రాబట్టింది. అంటే.. మరో రూ. 22.50 కోట్లు వస్తేనే ఇది క్లీన్ హిట్ అవుతుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 14 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే 15 కోట్ల టార్గెట్‌కు ఇంకా రూ. 2.17 కోట్లు వసూలు చేయాల్సి ఉంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X