Varisu Closing Collections: షాకింగ్‌గా వారసుడు కలెక్షన్లు.. దిల్ రాజుకు వచ్చిన లాభమెంతో తెలిస్తే!
పేరుకు తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన హీరోనే అయినా.. తెలుగుతో పాటు దక్షిణాది మొత్తంలోనూ ఫాలోయింగ్‌ను, మార్కెట్‌ను పెంచుకుంటూ దూసుకుపోతోన్నాడు స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ ఒకడు. యాక్టింగ్‌తో పాటు అన్ని టాలెంట్లతో మెప్పిస్తోన్న అతడు.. సుదీర్ఘ కాలంగా సౌత్‌లో హవాను చూపిస్తున్నాడు. ఈ క్రమంలోనే ఈ సంక్రాంతికి 'వారసుడు' (తమిళంలో వారిసు) అనే సినిమాను చేశాడు. దీనికి ఆరంభంలో మంచి వసూళ్లు వచ్చినా.. క్రమంగా డౌన్ అయ్యాయి. ఈ నేపథ్యంలో 'వారసుడు' మూవీకి ఫుల్ రన్‌లో ప్రపంచ వ్యాప్తంగా ఎంత వచ్చిందో చూడండి!

‘వారసుడు’గా విజయ్ వచ్చాడు
తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా సినిమానే 'వారసుడు'. వంశీ పైడిపల్లి తెరకెక్కించిన ఈ మూవీలో రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించింది. దీన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, పీవీపీ బ్యానర్లపై దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. ఈ చిత్రానికి ఎస్ థమన్ సంగీతం అందించాడు. ఇందులో శరత్‌కుమార్, ప్రభు, ప్రకాశ్ రాజ్, జయసుధ కీలక పాత్రలు పోషించారు.

విజయ్ మూవీ బిజినెస్ డీటేల్స్
ఇళయదళపతి విజయ్ రేంజ్ ప్రకారమే 'వారసుడు' లేదా 'వారిసు' మూవీపై నెలకొన్న అంచనాలకు అనుగుణంగా.. ఈ సినిమా హక్కుల కోసం ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర స్థాయిలో పోటీ ఏర్పడింది. ఫలితంగా భారీ ధరలకు ఈ రైట్స్‌ను కొనుగోలు చేసుకున్నారు. ఇలా ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అన్ని ఏరియాలను కలుపుకుని రూ. 137.90 కోట్లు బిజినెస్ జరుపుకుంది.

మంచి టాక్.. కలెక్షన్లు మాత్రం
విజయ్ నటించిన ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'వారసుడు' తమిళంలో ముందుగా విడుదలైంది. అక్కడ ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ దక్కింది. కానీ, క్రమంగా ఈ సినిమాకు స్పందన కరువైపోయింది. అలాగే, ఆలస్యంగా వచ్చినా తెలుగులోనూ సేమ్ ఇదే సీన్ కనిపించింది. దీంతో ఈ చిత్రం నష్టాలతోనే ఫుల్ రన్‌ను ముగిస్తుందని అంతా అనుకున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు ఇలా
తెలుగు రాష్ట్రాల్లో 'వారసుడు' మూవీకి ఫుల్ రన్‌లో మోస్తరు వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో రూ. 5.52 కోట్లు, సీడెడ్‌లో రూ. 2.38 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.40 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.17 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 84 లక్షలు, గుంటూరులో రూ. 1.01 కోట్లు, కృష్ణాలో రూ. 1.03 కోట్లు, నెల్లూరులో రూ. 70 లక్షలతో.. రూ. 15.05 కోట్లు షేర్, రూ. 27.10 కోట్లు గ్రాస్ వచ్చింది.

ప్రపంచ వ్యాప్తంగా ఎంతంటే
ఇళయదళపతి విజయ్ 'వారిసు' మూవీ ప్రపంచ వ్యాప్తంగా సత్తా చాటుకుంది. ఈ సినిమాకు తమిళనాడులో రూ. 142.85 కోట్లు, కర్నాటకలో రూ. 14.60 కోట్లు, కేరళలో రూ. 13.02 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 14.36 కోట్లు, ఓవర్సీస్‌లో రూ. 88.92 కోట్లు వచ్చాయి. వీటితో కలిపి ఫుల్ రన్‌లో రూ. 301.40 కోట్లు గ్రాస్‌తో పాటు రూ. 153.80 కోట్లు వరకూ షేర్‌ను దక్కింది.

విజయ్ సినిమాకు లాభాలిలా!
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్ చేసిన 'వారసుడు' మూవీకి అంచనాలకు అనుగుణంగానే రూ. 139 కోట్లు టార్గెట్‌తో వచ్చింది. ఇది ఫుల్ రన్‌లో రూ. 153.80 కోట్లు రాబట్టింది. తద్వారా రూ. 14.80 కోట్లు లాభాలను అందుకుంది. ఇక, తెలుగులో దీనికి రూ. 14 కోట్లు బిజినెస్ జరిగింది. అంటే.. 15 కోట్ల టార్గెట్‌కు మొత్తంగా రూ. 5 లక్షలు వరకూ లాభాలు సొంతం అయ్యాయి.

తృటిలో తప్పించుకున్నాడు
క్రేజీ కాంబినేషన్‌లో కుటుంబ కథతో రూపొందిన 'వారసుడు' మూవీకి ఆశించిన రీతిలో కలెక్షన్లు రాలేదు. దీంతో ఈ చిత్రం పరాజయం పాలవుతుందని అంతా అనుకున్నారు. కానీ, బాగానే పుంజుకున్న ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుని అన్ని భాషల్లోనూ హిట్‌గా నిలిచింది. ఫలితంగా నిర్మాత దిల్ రాజు నష్టాల నుంచి తృటిలో తప్పించుకున్నారని చెప్పొచ్చు.


Click it and Unblock the Notifications











