దుమ్ములేపిన విజిల్, ఖైదీలు.. హోరాహోరీ పోరు.. మొదటి రోజు ఎంత కొల్లగొట్టాయంటే..
Recommended Video
ఇళయ దళపతి విజయ్ నటించిన విజిల్ ఓ వైపు, కార్తీ నటించిన ఖైదీ మరో వైపు. విజిల్ స్పోర్ట్స్ అండ్ ఎమోషనల్ డ్రామా అయినప్పటికీ మాస్‌కు కావాల్సిన అంశాలు పుష్కలంగా ఉండటం కలసొచ్చే అంశం కాగా.. ఖైదీ యాక్షన్ అండ్ ఎమోషనల్ డ్రామా పాటలు, ఎంటర్టైన్మెంట్ లేకుండా ప్రేక్షకుడి సీటు అంచున కూర్చో బెట్టే కథనం కావడం ఖైదీకి ప్లస్ అయిన అంశం.

హ్యాట్రిక్ దిశగా..
దర్శకుడు అట్లీ ఇంతకుమందు తేరీ, మెర్సెల్ సినిమాలతో విజయ్ కెరీర్‌లోనే నిలిచిపోయే రికార్డులను క్రియేట్ చేసింది. ఈ రెండు సినిమాలు భారీ విజయాన్ని సాధించగా.. మూడో సినిమా విజిల్‌తో హ్యాట్రిక్ కొట్టేందుకు వచ్చారు. సోషల్ మెసెజ్, విజయ్ ఫ్యాన్స్ కోరుకునే సీన్స్, ఎమోషనల్ సీన్స్ ఇలా అన్నీ కుదురడంతో ఈ మూవీకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది.

ఒక్క రాత్రిలోనే..
డ్రగ్స్ మాఫియాను మట్టుబెట్టేందుకు పోలీసుల ప్రయత్నం, పోలీసుల అంతుచేసేందుకు మాఫియా పన్నాగాలు, వీటన్నంటికి మధ్య పుట్టినప్పటి నుంచి తన కూతురుని చూడకుండా ఉన్న ఖైదీ ఇలా సినిమాను అందరికీ మెచ్చే విధంగా.. ఆకట్టుకునే స్క్రీన్‌ప్లేతో రావడం.. కార్తీ కెరీర్‌లోనే బెస్ట్ ఓపెనింగ్స్‌కు కారణం అయింది.

రెండు తెలుగు రాష్ట్రాల్లో...
దీపావళి సందర్భంగా తెలుగు సినిమాలేవీ పోటీలో లేకపోవడంతో కావాల్సినన్ని థియేటర్లు దొరికాయి. ఎన్నడూ లేనంత పెద్ద ఎత్తులో ఈ చిత్రాలను విడుదల చేశారు. దీంతో మొదటి రోజు పెద్ద ఎత్తులోనే కలెక్షన్లను రాబట్టాయని తెలుస్తోంది. విజిల్ దాదాపు 3 కోట్లు కలెక్ట్ చేస్తే.. ఖైదీ రెండు కోట్ల వరకు రాబట్టినట్టు సమాచారం.

తమిళ నాట విజయ్ హవా...
తమిళ నాట ఈ సినిమా అదిరిపోయే ఓపెనింగ్స్‌ను రాబట్టినట్టు టాక్. దాదాపు 25 కోట్ల గ్రాస్‌ను తమిళ్ నుంచే రాబట్టిన్టట్టు, ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ దాదాపు 70 కోట్ల గ్రాస్‌ను కలెక్ట్ చేసిందని తెలుస్తోంది. ఓవర్సీస్‌లో దాదాపు 30కోట్లు కలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

కార్తీ కెరీర్‌లో ది బెస్ట్...
ఈ మూవీ కార్తీ కెరీర్‌లోనే ఖైదీ ఓపెనింగ్స్ ది బెస్ట్‌గా నిలిచిపోతాయేమో. ఈ మూవీ తమిళ నాట దాదాపు 15 కోట్ల గ్రాస్‌ను కొల్లగొట్టినట్టు సమాచారం. అయితే ఖైదీకి పెరుగుతున్న మౌత్ టాక్‌తో షో షోకి ఆక్యుపెన్సీ పెరుగుతోందని టాక్. అయితే ఇదే రేంజ్‌లో దూసుకుపోతే కెరీర్‌లోనే రికార్డు కలెక్షన్లు కొట్టే అవకాశం ఉంది.


Click it and Unblock the Notifications











