Leo day 1 Box office Prediction విజయ్ కెరీర్‌లో బిగ్గెస్ట్ ఓపెనింగ్స్.. తొలి రోజు ఎన్ని కోట్లంటే?
తమిళనాడు సూపర్ స్టార్ విజయ్, అందాల భామ త్రిషా కృష్ణన్, సీనియర్ హీరో అర్జున్ సర్జా నటించిన లియో చిత్రం అక్టోబర్ 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్నది. స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ నిర్మాతలు ఎస్ఎస్ లలిత్ కుమార్, జగదీష్ పళనిస్వామి నిర్మించారు. ఈ చిత్రంలో సంజయ్ దత్, గౌతమ్ వాసుదేవ మీనన్, మిస్కిన్ తదితరులు నటించారు. ఈ సినిమా ఓవర్సీస్ బిజినెస్ ఒక నెల రోజుల ముందే మొదలైంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్, బడ్జెట్, తొలి రోజు కలెక్షన్ల అంచనా వివరాల్లోకి వెళితే..
తమిళనాడులో లియో సినిమా అడ్వాన్స్ బుకింగ్ వివరాల్లోకి వెళితే.. తాజా సమాచారం ప్రకారం 11.5 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తొలి వారాంతానికి ఈ చిత్రం 31 కోట్ల రూపాయలు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేసింది. ఇక కర్ణాటకలో ఈ చిత్రం తొలి రోజు అడ్వాన్స్ బుకింగ్ 9 కోట్ల రూపాయలుగా నమోదైంది.

ఇక తెలుగు రాష్ట్రాల్లో లియో సినిమా కలెక్షన్ల వివరాల్లోకి వెళితే.. ఈ చిత్రం హైదరాబాద్‌లోనే 1.25 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం కలిపి 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. కేరళలో ఈ చిత్రానికి భారీ స్పందన కనిపిస్తున్నది. ఈ చిత్రం తొలి రోజు 7 కోట్ల రూపాయలను అడ్వాన్స్ బుకింగ్ రూపంలో కలెక్షన్లను రాబట్టింది. వారాంతానికి ఈ చిత్రం 9 కోట్ల రూపాయలు వసూలు చేసింది.

లియో ఉత్తర అమెరికా అంటే.. అమెరికా, కెనడాలో భారీగా వసూళ్లను రాబట్టింది. ఉత్తర అమెరికాలో 560 లొకేషన్లలో 1420 షోలు ప్రదర్శిస్తున్నారు. దాంతో తొలి రోజున 1 మిలియన్ డాలర్లు సుమారు 8 కోట్లకుపైగా, వారాంతానికి ఈ చిత్రం 2 మిలియన్ డాలర్లు అంటే.. 16 కోట్ల రూపాయలకుపైగా కేవలం అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.
ఇక యూకే, మలేషియా, ఆస్ట్రేలియా, గల్ఫ్, మిడిల్ ఈస్ట్, యూరప్ దేశాల్లో భారీ వసూళ్లు రాబడుతున్నది. యూకేలో 700K డాలర్లు అంటే.. 6 కోట్ల రూపాయలు, మలేషియాలో 850K డాలర్లు అంటే 7 కోట్ల రూపాయలు, ఆస్ట్రేలియాలో 300K డాలర్లు అంటే.. 2.5 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఇక గల్ఫ్, మిడిల్ ఈస్ట్ దేశాల విషయానికి వస్తే.. 1.1 మిలియన్ డాలర్లు అంటే.. 9.15 కోట్ల గ్రాస్ వసూళ్లను, యూరప్‌లో 850K డాలర్లు అంటే.. 7 కోట్ల రూపాయలకుపైగా అడ్వాన్స్ బుకింగ్ రూపంలో రాబట్టింది.

లియో సినిమాకు ఓవర్సీస్‌లో అద్బుతమైన రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. ఈ చిత్రం ఓవర్సీస్‌లో తొలి రోజు కలెక్షన్ల విషయానికి వస్తే.. 38.8 కోట్ల రూపాయలు అంటే.. 4.6 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. ఇక వారాంతానికి 6.6 మిలియన్ డాలర్లు అంటే.. 55 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. దాంతో తొలి రోజు భారీ వసూళ్లు నమోదయ్యేందుకు సిద్దమైంది.

లియో చిత్రం బాక్సాఫీస్ కలెక్షన్లపై బారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ కెరీర్‌లో అత్యధికంగా వసూళ్లను సాధించిన చిత్రాల్లో ఒకటిగా నిలిచే అవకాశం ఉంది. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకుపైగా గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.


Click it and Unblock the Notifications











