Vikram movie day 1 collections.. ప్రపంచవ్యాప్తంగా కమల్ వసూళ్ల ప్రభంజనం.. తొలి రోజు ఎంత అంటే?
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం తొలి ఆట నుంచే బ్లాక్ బస్టర్ టాక్‌తో దూసుకెళ్తున్నది. తొలి ఆట నుంచే ఏక పక్షంగా సూపర్ హిట్ అని ప్రేక్షకులు తేల్చేయడంతో భారీ వసూళ్లు నమోదు అవుతున్నాయి. కమల్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, సూర్య నటించిన విక్రమ్ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అనూహ్య స్పందన లభిస్తున్నది. ఈ నేపథ్యంలో విక్రమ్ సినిమా తొలి రోజు ఎంత వసూలు చేసే అవకాశం ఉందంటే?

అమెరికాలో భారీ స్పందన
అమెరికాలో విక్రమ్ సినిమా ప్రభంజనం కొనసాగుతున్నది. తొలి రోజున ప్రీమియర్ల (750K)తో కలిపి 2 మిలియన్ డాలర్లు వసూలు చేసే అవకాశం ఉంది. అంటే ఈ చిత్రం తొలి రోజున 14 కోట్లు రాబట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అన్ని భాషల్లో రిలీజైన విక్రమ్‌కు మంచి రెస్పాన్స్ వస్తున్నది.

మలేషియాలో కూడా అదే జోష్
విక్రమ్ సినిమా మలేషియాలో కూడా భారీ రెస్పాన్స్ కూడగట్టుకొంటున్నది. తొలి రోజున 93 లొకేషన్లలో 1210 షోల ద్వారా 40 వేల టికెట్లు అమ్ముడైనట్టు సమాచారం. దాంతో ఈ చిత్రం అడ్వాన్సు బుకింగ్ రూపంలో 165k మలేషియన్ డాలర్లు వసూలుచేసింది. ఇక తొలి రోజు గ్రాస్ 675k మలేషియన్ డాలర్లు ఉండవచ్చని ట్రేడ్ వర్గాల అంచనా.

తమిళనాడు, కర్ణాటకలో
తమిళనాడులో విడుదలైన ప్రతీ చోట జైత్రయాత్రను ప్రారంభించింది. తమిళనాడు వ్యాప్తంగా తొలి రోజు 10 కోట్ల వరకు వసూళ్లను రాబట్టే ఛాన్స్ కనిపిస్తున్నది. కమల్ కెరీర్‌లో నాన్ విజయ్ సినిమాల్లో ఇదే అత్యధికమైన వసూళ్లుగా నమోదయ్యే అవకాశం ఉంది. ఇక కర్ణాటకలో కనీసం 2 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉంది.

కేరళలో రికార్డు వసూళ్ల అంచనా
కేరళ రాష్ట్రంలో విక్రమ్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ చిత్రం తొలి రోజే ఈ ఏడాది అత్యధిక వసూళ్లు సాధించిన 4 చిత్రంగా ఓ రికార్డుకు చేరువ కాబోతున్నది. RRR, KGF Chapter 2, Beast సినిమా కలెక్షన్ల తర్వాత విక్రమ్ అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించనున్నది తొలి రోజు 970 షోల ద్వారా 1.80 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయని ట్రేడ్ వర్గాల సమాచారం. కేరళలో తొలి రోజున విక్రమ్ చిత్రం 5 నుంచి 6 కోట్ల మధ్య వసూళ్లను నమోదు చేసుకొనే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
ఇక తెలుగు రాష్ట్రాల్లో విక్రమ్ సినిమాకు భారీ స్పందన వ్యక్తమవుతున్నది. ఈ చిత్రం 60 శాతం అక్యుపెన్సీతో కొనసాగింది. దాంతో ఈ చిత్రం తొలి రోజున 7 కోట్ల గ్రాస్, 4 కోట్ల షేర్ సాధించే అవకాశం ఉంది. ఇంకా ఈ కలెక్షన్ల లెక్కలు పెరిగే అవకాశం లేకపోలేదనే మాట ట్రేడ్ వర్గాల్లో వినిపిస్తున్నది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల అంచనా
విక్రమ్ సినిమాకు ప్రపంచంలోని అన్ని ప్రాంతాల్లో, అన్ని భాషల్లో ఏక పక్షంగా పాజిటివ్ టాక్ వస్తుండటంతో రికార్డు వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా కనీసం 40 కోట్ల రూపాయలకుపైగా వసూళ్లను సాధించే అవకాశం ఉంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 95 కోట్లుగా నమోదైంది. అయితే అంతా సవ్యంగా సాగితే ఈ వారాంతంలో బ్రేక్ ఈవెన్ సాధించే అవకాశాలు లేకపోలేదు అని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











