Vikram movie collections 100 కోట్లపై కన్నేసిన కమల్.. తొలి రోజు ఎంత వసూలు చేసిందంటే?
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ , సూర్య ప్రత్యేక పాత్రలో నటించిన విక్రమ్ చిత్రం ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల జైత్రయాత్రను ప్రారంభించింది. రిలీజైన ప్రతీ చోట బ్రహ్మండమైన కలెక్షన్లను నమోదు చేస్తున్నది. విడుదలైన ప్రతీ భాషలోను ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తున్నారు. తమిళంలో 2002లో విడుదలైన చిత్రాల్లో టాప్ 3 చిత్రంగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక తమిళనాడులోనే 100 కోట్ల క్లబ్‌లో చేరేందుకు పరుగులు పెడుతున్నది. ఇలాంటి సానుకూలమైన వార్తల నేపథ్యంలో తొలి రోజు విక్రమ్ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందంటే..

న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలో
విక్రమ్ చిత్రానికి ఓవర్సీస్‌లో బ్రహ్మండమైన వసూళ్లు నమోదయ్యాయి. తొలి రోజున న్యూజిలాండ్‌లో 27204 న్యూజిలాండ్ డాలర్లను వసూలు చేసింది. ఇక ఆస్ట్రేలియాలో కూడా అదే జోష్ కనిపించింది. తోలి రోజున ఆస్ట్రేలియాలో 233754 ఆస్ట్రేలియన్ డాలర్లను రాబట్టింది. 2022లో ఈ రెండు దేశాల్లో విడుదలైన భారతీయ సినిమాల్లో విక్రమ్ రెండో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది.

అమెరికాలో మిలియన్ డాలర్లు
విక్రమ్ చిత్రానికి అమెరికాలో మంచి స్పందన వ్యక్తమవుతున్నది. తొలి రోజున భారీ వసూళ్లను రాబట్టింది. ప్రీమియర్ల ద్వారా ఈ చిత్రం 735k డాలర్లను సాధించిన ఈ చిత్రం తొలి రోజున 424 లొకేషన్లలో అదనంగా మరో 406614 మిలియన్ డాలర్లు వసూలు చేసింది. దాంతో తొలి రోజునే ఈ చిత్రం మిలియన్ డాలర్ల వసూళ్లను సాధించింది.

తమిళనాడులో హయ్యెస్ట్ వసూళ్లు
కమల్ హాసన్ కెరీర్‌లోనే విక్రమ్ చిత్రం అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. తొలి రోజున హయ్యెస్ట్ కలెక్షన్లను సాధించింది. చెన్నైలోనే 1.71 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. తమిళనాడులోనే ఈ చిత్రం 32.25 కోట్ల గ్రాస్ కలెక్షన్లను రాబట్టింది. వారాంతంలోగా ఈ సినిమా 100 కోట్ల క్లబ్‌లో చేరడం ఖాయమని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.

కర్ణాటకలో, కేరళలో, ఉత్తరాదిలో
ఇక కర్ణాటకలో, కేరళలో, ఉత్తరాదిలో విక్రమ్ వసూళ్ల జోరు భారీగానే కనిపించింది. కర్ణాటకలో ఈ చిత్రం 3.88 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక కేరళలో కూడా ఈ చిత్రం 5 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. హిందీలో ఈ చిత్రం 50 లక్షల గ్రాస్ వసూళ్లను రాబట్టింది.

తెలుగు రాష్ట్రాల్లో వసూళ్లు
విక్రమ్ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో భారీగానే వసూళ్లను రాబట్టింది. నైజాంలో 67 లక్షలు, సీడెడ్‌లో 3 లక్షలు, ఉత్తరాంధ్రలో 31 లక్షలు, తూర్పు గోదావరి జిల్లాలో 19 లక్షలు, వెస్ట్ గోదావరి జిల్లాలో 13 లక్షలు, కృష్ణా జిల్లాలో 15 లక్షలు, గుంటూరు జిల్లాలో 15 లక్షలు, నెల్లూరులో 10 లక్షతో మొత్తంగా 3.6 కోట్ల గ్రాస్, 2 కోట్ల షేర్ వసూళ్లను సాధించింది.

ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్లు
యాక్షన్, థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన విక్రమ్ చిత్రానికి అన్ని వర్గాల నుంచి భారీ స్పందన వ్యక్తం కావడంతో ఇండియాలోనే 34.8 కోట్ల నికర వసూలు చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా సుమారు 50 కోట్ల వసూళ్లను రాబట్టింది. కమల్ హాసన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఘనతను సాధించింది.


Click it and Unblock the Notifications











