Vikram movie day 2 collections.. కమల్ హాసన్ బాక్సాఫీస్ జైత్రయాత్ర.. రెండో రోజు ఎన్నికోట్ల వసూళ్లంటే?
విలక్షణ నటుడు కమల్ హాసన్ నటించిన విక్రమ్ చిత్రం రెండో రోజు కూడా కలెక్షన్ల జైత్రయాత్రను కొనసాగించిందనే విషయాన్ని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా భారీ స్పందనను సొంతం చేసుకొన్నది. విడుదలైన ప్రతీ చోట కలెక్షన్ల మోతను మోగిస్తున్నది. ఇలాంటి సానుకూలమైన వార్తలతో రెండో రోజు అడ్వాన్స్ బుకింగ్‌తోపాటు కరెంట్ బుకింగ్‌కు అన్నిచోట్ల హోరెత్తింది. రెండో రోజు కలెక్షన్ల వివరాల్లోకి వెళితే..

తమిళనాడులో బ్రహ్మండమైన రెస్సాన్స్
విక్రమ్ సినిమాకు తమిళనాడులో బ్రహ్మండమైన ఆదరణ దక్కుతున్నదనే విషయం తాజా ట్రేడ్ రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. తొలి రోజున తమిళనాట 29 కోట్లు సంపాదించిన ఈ చిత్రం రెండో రోజు కూడా భారీ వసూళ్లను నమోదు చేసింది. తాజా ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 20 కోట్లు వసూలు చేసే అవకాశం ఉంది.

కేరళలో రికార్డు కలెక్షన్లు..
ఇక కేరళలో ఊహించిన రెస్పాన్స్ కనిపిస్తున్నదని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. కేరళలో అత్యధిక వసూళ్లు సాధించిన బీస్ట్, సర్కార్ చిత్రాల తర్వాత విక్రమ్ మూడో స్థానంలో నిలిచింది. తొలి రోజు 5 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం రెండో రోజు అదే ఊపు కనిపించింది. మొత్తంగా కేరళలో రెండో రోజున 4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.

కర్ణాటక ఇతర రాష్ట్రాల్లో
ఇక కర్ణాటకలో కూడా భారీ ఆదరణే లభిస్తున్నది. ఈ చిత్రం రెండో రోజున కర్ణాటకలో 4 కోట్లు రాబట్టవచ్చని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. మిగితా రాష్ట్రాల్లో 1.5 కోట్ల గ్రాస్ నమోదు చేసే అవకాశం ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో కలెక్షన్లు
ఇదిలా ఉంటే.. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజుకంటే రెండో రోజు భారీ వసూళ్లు రాబట్టింది. విజయవాడ 6.96 లక్షలు, వైజాగ్ 11.03 లక్షలు, నెల్లూరు జిల్లాలో 1.47 లక్షలు, గుంటూరు జిల్లాలో 1.98 లక్షలు, అనంతపురంలో 2.06 లక్షలు, ఏలూరులో 2.06 లక్షలు, కరీంనగర్ జిల్లాలో 70 వేలు, వరంగల్‌లో 2.33 లక్షల అడ్వాన్స్ బుకింగ్ నమోదైంది. తొలి రోజున 2.8 కోట్లు వసూలు చేస్తే.. రెండో రోజున 3 కోట్లకుపైగా వసూళ్లను నమోదు చేసినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేశారు.

ఓవర్సీస్‌లో భారీగా రాబడి
విక్రమ్ చిత్రం ఓవర్సీస్‌లో హంగామా చేస్తున్నది. రెండో రోజున గల్ఫ్‌లో 5 కోట్లు, అమెరికాలో 3 కోట్లు, యూకేలో 1 కోటి రూపాయలు, ఆస్ట్రేలియాలో 80 లక్షలు, న్యూజిలాండ్‌లో 9 లక్షలు, మలేషియాలో 1 కోటి, ఫ్రాన్స్‌లో 20 లక్షలతో కనీసం 20 కోట్ల గ్రాస్ వసూళ్లను నమోదు చేసే అవకాశం ఉందని వెల్లడిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా రెండో రోజు కలెక్షన్ల అంచనా
విక్రమ్ చిత్రం తెలుగులో 27 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టే అవకాశం ఉంది. ఇక ఓవర్సీస్, ఇతర ప్రాంతాల్లో మొత్తంగా కలిపి మరో 20 కోట్లు వసూలు చేయడం ఖాయం. మొత్తంగా ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గత రెండు రోజుల్లో 80 కోట్లకుపైగా వసూళ్లను రాబట్టే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.


Click it and Unblock the Notifications











