Vikram 14 Days Collections: కమల్ హాసన్ బెస్ట్ బాక్సాఫీస్ రికార్డ్.. మొత్తం ప్రాఫిట్స్ ఎంతంటే?
ఇండియన్ సినిమా ప్రపంచంలో అత్యంత సీనియర్ హీరోలలో ఒకరైన కమల్ హాసన్ గతంలో బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులను క్రియేట్ చేశారు. అయితే గత పది రోజులుగా ఆయన బాక్సాఫీస్ వద్ద సరైన సక్సెస్ అందుకోలేదు. ఇక మొత్తానికే విక్రమ్ సినిమాతో మళ్ళీ తన సత్తాను గుర్తుచేశాడు. ఊహించని విధంగా విక్రమ్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్లకు పైగా కలెక్ట్ చేసి అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక మొత్తంగా 14 రోజుల్లో ఈ సినిమా ఏ స్థాయిలో లాభాలను అందుకుంది ఎంత కలెక్ట్ చేసింది అనే వివరాల్లోకి వెళితే.

ప్రీ రిలీజ్ బిజినెస్
విక్రమ్ సినిమా తెలుగులో కూడా మంచి సక్సెస్ అవుతుందనే కమల్ హాసన్ చాలా జాగ్రత్తలు తీసుకొని ప్రమోషన్స్ కూడా చేశారు. ఇక నితిన్ హోమ్ బ్యానర్ శ్రేష్ట మూవీస్ లో సుధాకర్ రెడ్డి ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో విడుదల చేసిన విషయం తెలిసిందే. తెలుగులో 7కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన విక్రమ్ సినిమా ప్రపంచ్యాప్తంగా 100కోట్ల వరకు బిజినెస్ చేసింది.

14వ రోజు వచ్చిన కలెక్షన్స్
'విక్రమ్' సినిమాకు 14వ రోజూ ఆంద్రప్రదేశ్ తెలంగాణలో కలెక్షన్స్ చాలా వరకు తగ్గాయి. మిగతా సినిమాల నుంచి పోటీ ఉన్నప్పటికీ గత వారం వరకు ఈ సినిమా మంచి వసూళ్లను సొంతం చేసుకుంది. ఇక 13వ రోజు 24 లక్షల షేర్ సాధించిన విక్రమ్ సినిమా 14వ రోజు మాత్రం కేవలం 19 లక్షల షేర్ మాత్రమే రాబట్టింది. ఈ వారం కొత్త సినిమాలు రావడంతో విక్రమ్ కు గట్టి పోటీ నెలకొంది.

టోటల్ 14 రోజుల కలెక్షన్స్
'విక్రమ్' రెండు రాష్ట్రాల్లో 14 రోజుల్లో మొత్తం అందుకున్న కలెక్షన్స్ ఏరియాల వారిగా చూసుకుంటే.. నైజాంలో రూ. 6.18 కోట్లు, సీడెడ్‌లో రూ. 1.92 కోట్లు, ఉత్తరాంధ్రలో రూ. 2.12 కోట్లు, ఈస్ట్ గోదావరిలో రూ. 1.09 కోట్లు, వెస్ట్ గోదావరిలో రూ. 73 లక్షలు, గుంటూరులో రూ. 98 లక్షలు, కృష్ణాలో రూ. 1.08 కోట్లు, నెల్లూరులో రూ. 51 లక్షలతో.. రెండు రాష్ట్రాల్లో రూ. 14.61 కోట్లు షేర్, రూ. 25.41 కోట్లు గ్రాస్ దక్కింది.

ప్రపంచవ్యాప్తంగా వచ్చిన షేర్
తెలుగు రాష్ట్రాల్లో 14 రోజుల్లో రూ. 25.41 కోట్ల గ్రాస్ రాబట్టిన 'విక్రమ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగాను భారీగా కలెక్షన్స్ అందుకుంది. తమిళనాడులో 147.05 కోట్లు, కర్ణాటక 18.20 కోట్లు, కేరళ 33.00కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.10కోట్లు, ఓవర్సీస్ లో 109.05 కోట్లు వీటితో కలిపి 14 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా దీనికి రూ రూ. 340.81 కోట్లు గ్రాస్, 170.00 కోట్ల షేర్ వసూలు సాదించింది.

మొత్తం లాభాలు ఎంతంటే?
'విక్రమ్' సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు రూ. 100 కోట్లు వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. తెలుగులో రూ. 7 కోట్ల బిజినెస్ చేయగా.. రూ. 7.50 కోట్ల టార్గెట్‌కు.. రూ. 14.61 కోట్లు రావడంతో విక్రమ్ తెలుగు లో రూ. 7.10 కోట్ల ప్రాఫిట్స్ తో ముందుకి సాగుతోంది. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే సినిమాకు 70కోట్లకు పైగానే ప్రాఫిట్స్ వచ్చినట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











